ఏడాదిలో ఆ రెండు రోజులు కేరళలోని పద్మనాభస్వామి గుడిలో అద్భుతం.. వీడియో

-

ఆ రెండు రోజులు ఈ గుడిలో అద్భుతం జరుగుతుంది. గుడి ముందు ఉన్న గోపురానికి కొన్ని బ్లాక్స్ ఉంటాయి. పై నుంచి కింది వరకు మధ్యలో కిటికీల్లా నిర్మించారు. పై నుంచి కిందికి మధ్యలో వరుసగా ఉన్న ఆ బ్లాక్స్ నుంచి సూర్యుడు వెళ్తాడు.. అదే అక్కడ జరిగే అద్భుతం.

మీకు కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడి తెలుసా? ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక గుడి. కేరళలోని తిరువనంతపురంలో ఈ గుడి ఉంది. ఈ గుడికి ఉన్న విశిష్టతలు ఏ గుడికీ లేవు. ఈ గుడి నిర్మాణం అద్భుతో అద్భుతః. అవును.. ఈ గుడిని నిర్మించిన ఇంజినీర్లు నిజంగా గ్రేట్. ఎందుకంటే.. ఈ గుడిని ఈక్వినాక్స్‌కు అనుగుణంగా నిర్మించారు. ఏంటో.. ఏదేదో చెబుతున్నారు.. అర్థం కావడం లేదు అంటారా? పదండి.. డిటెయిల్‌గా తెలుసుకుందాం.

ముందుగా ఈక్వినాక్స్ అంటే ఏందో తెలుసుకుందాం. దాన్ని ఇంగ్లీష్‌లో Equinox అని రాస్తారు. అంటే.. ఒక రోజులో పగలు ఎంత సమయం ఉంటుందో రాత్రి కూడా అంతే సమయం ఉంటుందన్నమాట. పగలు, రాత్రి సమానంగా ఉన్న రోజును ఈక్వినాక్స్ అంటారు. ఏడాదిలో మన దగ్గర మార్చ్ 21న, సెప్టెంబర్ 23న ఈ రెండు రోజులు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి.

ఆ రెండు రోజులు ఈ గుడిలో అద్భుతం జరుగుతుంది. గుడి ముందు ఉన్న గోపురానికి కొన్ని బ్లాక్స్ ఉంటాయి. పై నుంచి కింది వరకు మధ్యలో కిటికీల్లా నిర్మించారు. పై నుంచి కిందికి మధ్యలో వరుసగా ఉన్న ఆ బ్లాక్స్ నుంచి సూర్యుడు వెళ్తాడు.. అదే అక్కడ జరిగే అద్భుతం.

సూర్యుడు ముందుగా పైన ఉన్న కిటికీ గుండా వెళ్తాడు.. ఆ తర్వాత రెండోది.. ఆ తర్వాత మూడోది.. అలా మొత్తం బ్లాక్స్ గుండా సూర్యుడు వెళ్తాడు. ఆ అద్భుతం ఈ రెండు రోజుల్లో మాత్రమే జరుగుతుంది. మిగితా రోజుల్లో జరగదు. ఆ గోపురానికి మొత్తం 7 అంతస్తులు ఉన్నాయి. ఆ 7 అంతస్తుల్లో మధ్యలో ఖాళీగా కిటికీలా 7 బ్లాక్స్ ఉంటాయి. ఒక దాంట్లో నుంచి మరో దాంట్లోకి ప్రవేశించడానికి సూర్యుడికి కనీసం 5 నిమిషాల సమయం పడుతుంది. ఈ అద్భుతాన్ని వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు ఆ రోజుల్లో అక్కడికి చేరుకుంటారట. ఒక్కోసారి ఆ తేదీల్లో కాకుండా.. కొంచెం అటూ ఇటూ కూడా ఈ అద్భుతం జరుగుతుంది. మార్చి 21 అంటే మార్చి 20 లేదా 21లో ఆ అద్భుతం జరుగుతుంది. సెప్టెంబర్ 22 లేదా 23న జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version