రాళ్లతో కొట్టుకోవడమే వాళ్లకు పండుగ.. వీడియో

-

[tps_title][/tps_title]

stone pelting festival held in shimla to appease Goddess Kali

రాళ్లతో ఫుల్లుగా ఒకరిని మరొకరు కొట్టుకుంటారు. అదే వాళ్లకు పండుగ. అలా కొట్టుకుంటేనే వాళ్లకు మనఃశాంతి. లేకపోతే వాళ్లు ప్రశాంతంగా ఉండరు. ప్రతి సంవత్సరం దీపావళికి ఈ పండుగను అక్కడ జరుపుకుంటారు. ఇంతకీ ఎక్కడ అంటారా? హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాకు దగ్గర్లో ఉన్న ధామి అనే ఊళ్లో. అవును…ఈ ఆచారం ఇప్పటిది కాదు.. దాదాపు 400 ఏళ్ల నుంచి కొనసాగుతున్నది. ధామి ఊళ్లోని రాజకుటుంబీకులు ఈ పండుగలో పాలు పంచుకుంటారు. ఒకరినొకరు రాళ్లతో కొట్టుకుంటారు. ధామి కుటుంబీకుల దేవత కాళి మాతను ప్రసన్నం చేసుకోవడానికే ఈ రాళ్లు విసురుకునే పండుగను జరుపుకుంటారట. రాళ్లు విసురుతున్నప్పుడు ఎవరికైనా ఆ రాయి తాకి రక్తం కారితే.. ఆ రక్తాన్ని దేవతకు అర్పించినట్టుగా భావిస్తారట అక్కడి ప్రజలు. వామ్మో.. ఇదేం పండుగరా బాబోయ్. దీపావళి సమయంలో షిమ్లా వైపు పోయేరు జాగ్రత్త.

Read more RELATED
Recommended to you

Latest news