స‌న్నీలియోన్‌ను వ‌ద‌లిపెట్ట‌ని నెటిజ‌న్లు.. ఆమె గురించే గూగుల్‌లో ఎక్కువ‌గా వెదుకుతున్నార‌ట‌..!

ప్ర‌స్తుతం భార‌త్‌లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ సైట్‌లో అత్య‌ధికంగా సెర్చ్ చేయబ‌డుతున్న సెల‌బ్రిటీల జాబితాలో స‌న్నీ లియోన్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది.

మొదట్లో కేవ‌లం శృంగార చిత్రాల‌కే ప‌రిమిత‌మైన న‌టి స‌న్నీలియోన్ నెమ్మ‌దిగా బాలీవుడ్ బాట ప‌ట్టి అక్క‌డ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. ప‌లు ద‌క్షిణాది సినిమాల్లోనూ ఈమె న‌టించింది. ముఖ్యంగా ప‌లు ఐటం సాంగ్‌ల‌లో స‌న్నీ లియోన్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అయితే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా స‌న్నీ లియోన్ ఇండియాలో గూగుల్‌లో అత్య‌ధికంగా సెర్చ్ చేయ‌బ‌డుతున్న సెల‌బ్రిటీగా గుర్తింపు పొందుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాది కూడా స‌న్నీ లియోన్ అదే జాబితాలో నిల‌వ‌గా, ఈ సారి ఏకంగా నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకోవ‌డం విశేషం.

sunny leone becomes top searched celebrity in india on google

ప్ర‌స్తుతం భార‌త్‌లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ సైట్‌లో అత్య‌ధికంగా సెర్చ్ చేయబ‌డుతున్న సెల‌బ్రిటీల జాబితాలో స‌న్నీ లియోన్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. ప్ర‌ధాని మోదీ, బాలీవుడ్ న‌టులు స‌ల్మాన్ ఖాన్‌, షారుక్ ఖాన్‌ల‌ను దాటేసిన స‌న్నీ ఈ జాబితాలో మొద‌టి స్థానంలో నిలిచింద‌ని తాజాగా విడుద‌లైన గూగుల్ ట్రెండ్స్ గ‌ణాంకాలు చెబుతున్నాయి. గ‌త ఏడాది మాత్ర‌మే కాకుండా అంత‌కు ముందు కూడా స‌న్నీ లియోన్ ఈ త‌ర‌హా జాబితాల్లో టాప్ 10 స్థానాల్లో కొన‌సాగుతూ వ‌స్తుండ‌గా, ఈ సారి నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌వ‌డం విశేషం. కాగా ఈమె గురించి ఎక్కువ‌గా ఈశాన్య రాష్ట్రాలైన మ‌ణిపూర్‌, అస్సాంల‌కు చెందిన యూజర్లే ఎక్కువ‌గా గూగుల్‌లో వెదుకుతున్నార‌ట‌.

ఇక ఆ యూజ‌ర్లు ఎక్కువ‌గా స‌న్నీ లియోన్ బ‌యోపిక్ క‌ర‌ణ్‌జిత్ కౌర్‌, ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ స‌న్నీ లియోన్ అనే సిరీస్‌కు చెందిన వీడియోల‌ను వెదుకుతున్నార‌ని గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. ఇక ఈ విష‌యంపై స‌న్నీ లియోన్‌ను మీడియా ప్ర‌శ్నించ‌గా.. త‌న అభిమానులు త‌న‌ను ఇంత‌టి స్థానంలో నిలిపినందుకు వారికి రుణ‌ప‌డి ఉంటాన‌ని ఆమె తెలియ‌జేసింది. ఏది ఏమైనా.. ఇప్పుడీ విష‌యం మాత్రం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది..!