ఈ మధ్యకాలంలో పిల్లలు స్క్రీన్లకి ఎక్కువ అలవాటు పడిపోయారు. ఎక్కువగా టీవీ చూడడం లేదంటే మొబైల్ ఫోన్స్ తో గడపడం చేస్తున్నారు. స్వీడన్ ఇప్పుడు పిల్లలకు ఫోన్ లేదా టీవీ ని చూపించొద్దని తల్లిదండ్రులకి హెచ్చరిస్తోంది. రెండేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి స్క్రీన్లను చూపించడం మంచిది కాదని.. ఎక్కువ సమయం ఈ వయసు వారు స్క్రీన్ల ముందు గడపడం వలన చాలా సమస్యలు వస్తాయని చెప్తోంది. స్వీడన్ హెల్త్ డిపార్ట్మెంట్ చిన్నారులను స్క్రీన్ లకు దూరంగా ఉంచాలని చెప్తోంది. డిజిటల్ మీడియా లేదా టీవీకి పిల్లలు అలవాటు పడిపోతే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. కేవలం చిన్న పిల్లలకే కాదు అన్ని వయసు వారు కూడా ఈ రూల్స్ ని తప్పక పాటించడం మంచిదని ప్రభుత్వం చెప్పింది.
ఈ మేరకు కొత్త రూల్స్ ని తీసుకువచ్చింది. స్వీడన్ హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని రూల్స్ తీసుకువచ్చింది. రెండు నుంచి ఐదు ఏళ్ళు పిల్లలు రోజుకు గంట కంటే ఎక్కువ సేపు స్క్రీన్ల ముందు గడపకూడదని 6 నుంచి 12 ఏళ్ల వయసు వారు గంట లేదా రెండు గంటల కంటే ఎక్కువ సమయం గడపకూడదని చెప్పింది. 13 నుంచి 18 ఏళ్ల వయసు వారు రెండు నుంచి మూడు గంటల కంటే ఎక్కువసేపు స్క్రీన్ల ముందు గడపడం మంచిది కాదని చెప్పింది. రాత్రిళ్ళు టీవీ పెట్టొద్దు రాత్రి నిద్ర పోవడానికి ముందు పిల్లలకు టీవీ పెట్టొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
ఫోన్ లేదా టాబ్లెట్ వంటివి కూడా పిల్లలకి రాత్రి నిద్రపోయే ముందు ఇవ్వొద్దని చెప్పింది. స్వీడన్ లో 13 నుంచి 16 ఏళ్ల మధ్య వాళ్ళు 6 నుంచి ఆరున్నర గంటల పాటు ఫోన్ లేదా టీవీ చూస్తున్నారని.. ఎక్కువసేపు ఇలా స్క్రీన్ల ముందు గడపడం వలన కుటుంబంతో సమయాన్ని గడపకపోవడం రాత్రి పూట నిద్రపోకపోవడం ఇలా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది.