ఆ దేశాల్లో టాటూ నిషేధం.. అరెస్ట్‌ చేయడానికి కూడా వెనకాడరట..!

-

అప్పట్లో పెద్దోళ్లు పచ్చబొట్టు అని వారికి ఇష్టమైన వారి పేర్లు లేదా ఏవో పద్మాల్లా ఉండే సింబల్స్ పొడిపించుకునే వాళ్లు..కానీ ఇప్పుడు అదే ట్రెండీగా టాటూగా మారింది. అయితే పచ్చబొట్టుకు, టాటూకు తేడా ఉంది. పచ్చబొట్టు పొడిచేప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. అది జీవితాంతం ఉంటుంది. టాటూ వేసేప్పుడు అంత నొప్పి ఉండదు. ఇంకా ఇది కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది కానీ..పచ్చబొట్టు ఉన్నంత ఉండదు..కాలక్రమేణా..మెరుపు తగ్గుతూ ఉంటుంది. అయితే ఇది వేసుకోవడం కష్టమే కాదు..ఖరీదు కూడా. ఇంచ్ కే..600-800 అంతకు పైనే తీసుకుంటారు కొన్ని ఏరియాస్ లో. మనదేశంలో టాటూలకు ఎలాంటి నిబంధనలు లేవు. ఎవరైనా ఏదైనా వేయించుకోవచ్చు. కానీ కొన్ని దేశాల్లో టాటూలు నిషేధమట. టాటూలతో విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలి.

జపాన్

గతంలో నేరస్థులను త్వరగా గుర్తు పట్టడానికి పచ్చబొట్టులు వేసేవారు. ఆ తర్వాతి క్రిమినల్ అసోసియేషన్స్ దీనిని అలవాటుగా మార్చుకున్నాయి. ఇప్పటికీ కొన్ని స్విమ్మింగ్ పూల్స్, హోటల్స్, స్పాలు, పబ్లిక్ బాతింగ్ ఏరియాల్లో టాటూలు నిషేదం.

ఇరాన్

2015 లోనే ఇరాన్ టాటూలను నిషేదించింది. ప్రత్యేకించి ఇది పాశ్చాత్య సంస్కృతి అంటూ స్పైక్‌డ్ హెయిర్ లాంటి వాటికి కూడా అనుమతి నిరాకరించింది.

యూఏఈ

టాటూలు శరీరాన్ని పాడు చేస్తాయని భావిస్తుంది యూఏఈ. అది కూడా ఇస్లామిక్ ప్రక్రియను వ్యతిరేకించినట్లే అవుతుందని వీరు నమ్ముతారు.

టర్కీ

ఇక్కడ కూడా ఇస్లామిక్ లానే అప్లై అవుతుండటంతో టాటూలను దూరం పెట్టేశారు. ప్రత్యేకించి స్టూడెంట్లు వాటి జోలికి వెళ్లకూడదు.

చైనా

షాంగై, బీజింగ్ లతో పలు రూరల్ ఏరియాల్లో మినహాయిస్తే టాటూలకు చైనాలో అనుమతి లేదు. ఈ విషయం మనకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చమో కదా.!

వియత్నాం

వియత్నాంలోనూ క్రిమినల్స్, గ్యాంగ్ స్టర్స్ మాత్రమే యాటిట్యూడ్ చూపించుకోవడానికి టాటూలు వేయించుకుంటుంటారు. మిగిలిన వాళ్లు దాదాపు టాటూలకు దూరమే.

శ్రీలంక

శ్రీలంకలో టాటూలు నిషేదం..కేవలం నిషేధమే కాదు..వీళ్లు ఈ రూల్ పై కాస్త కఠినంగా కూడా ఉన్నారు. ఎంతలా అంటే.. ఓ బ్రిటిష్ మహిళను టాటూల కారణంగా అరెస్టు చేశారు.
ఇంకా టాటూలు ఉంటే గవర్నమెంట్ జాబ్ కు అనర్హులు అని కూడా మన దేశంలో చాలా మంది అనుకుంటారు. ఇలా ఇన్ని నిబంధనలు ఉన్న టాటూలు వేయించుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఆ మనకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ మీద ఆశ లేదు..వీదేశాలకు వెళ్లే ఛాన్స్ లేదు అనే వాళ్లు మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోరు అనుకోండి. నిజానికి టాటూస్ పాశ్చాత్యకల్చర్, వేయించుకుంటే స్కిన్ డిసీస్ లాంటివి వస్తాయి అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే..టాటూస్ వ్యక్తికి కొత్త గుర్తింపుని ఇస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. స్కిన్ డిసీస్ కూడా నాణ్యతలేని సూదులు, ఇంక్ వాడినవారిలోనే కనిపిస్తాయి అని టాటూస్ అంటే ఇష్టపడేవారు అనే మాట. ఇంతకీ మీకు టాటూ ఉందా..వేయించుకునే ఉద్దేశమైనా ఉందా..?!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news