లైంగిక ఆరోగ్యం సమాజంలో మీ ప్రవర్తనపై చూపే ప్రభావం..

-

టీనేజీ ప్రాయం మొదలవగానే వారిలో చాలా మార్పులు కనిపిస్తాయి. రూపం మారుతుంది. కంఠం మారుతుంది. శరీరం మారుతుంది. ఇలా ఒక్కో మార్పు కౌమార దశలోకి తీసుకువస్తాయి. ఐతే అప్పుడు అదంతా చాలా కొత్తగా ఉంటుంది. అలాంటి సమయంలో జీవితాన్ని సరైన దిశలోకి తీసుకువెళ్ళకపోతే ఆ తర్వాత ఇబ్బందులు తప్పవు. భారత దేశమ్ళో 22శాతం జనాభా టీనేజీ దశలోనే ఉన్నారు. వారందరూ చాలా విభిన్న సంస్కృతులకి చెందినవారు. విభిన్న ఆర్థిక పరిస్థుతుల కారణంగా కొందరికి కౌమార ప్రాయం రాగానే పెద్దవారిగా గుర్తింపబడతారు. అందుకే ఆ దశలో ఉండగానే పెళ్ళిళ్ళు జరుపేస్తుంటారు.

పాఠశాల చదువులు మాన్పించేసి మరీ పెళ్ళి చేసేయడం చేస్తుంటారు. దీనివల్ల కొందరికి లైంగికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరైన జ్ఞానం లేకపోవడం వల్ల అసురక్షిత సెక్స్, హెచ్ ఐవీ వంటి వాటికి గురయ్యే అవకాశం ఉంది. సంస్కృతిలో ఉండే నిషేధాలు కూడా వారిని ఉద్రేకపరుస్తాయి. ఇలాంటప్పుడు కౌమార ప్రాయంలో ఉన్నప్పుడు వారికి తల్లిదండ్రుల నుండి సలహాలు అందడం మంచిది. కావాల్సిన వైద్యం అందించినా సరిపోతుంది.

కౌమారంలో ఉన్నవారికి భవిష్యత్తు మీద ఒక అవగాహన తీసుకువస్తే మంచిది. దీనికోసం లైంగిక జ్ఞానం ఖచ్చితంగా అవసరం. కొన్ని కొన్ని సార్లు వారి ఎంపికలు అనేక తప్పుడు దార్లకి దారి తీస్తాయని చెప్పాలి. టీనేజీలో ఉన్న బాలికలకు అసురక్షిత లైంగిక అనారోగ్యం గురించి చర్చించాల్సి ఉంటుంది. మనదేశంలో 18-24సంవత్సరాల మహిళల్లో 40శాతం మంది 18ఏళ్ళ కంటే ముందే పెళ్ళి చేసుకున్నారు. వారిలో 13శాతం మంది గర్భనిరోధకాలు ఉపయోగించారు. కౌమార దశ వారి శరీరంపై చాలా ప్రభావం చూపిస్తుంది. కానీ ఇలాంటి విషయాల పట్ల ఒక అవగాహన ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరగవు.

Read more RELATED
Recommended to you

Latest news