వాట్సాప్‌లో స‌రికొత్త ఫీచ‌ర్‌.. తెలిస్తే ఫుల్ ఖుషీ అవ్వాల్సిందే!

-

వాట్సాప్ అంటే తెలియ‌ని వారే ఉండ‌రు. చిన్న వాళ్ల ద‌గ్గ‌రి నుంచి పెద్ద‌వారి దాకా అంతా ఇప్పుడు దీన్నే ఎక్కువ‌గా వాడుతుంటారు. ఫేస్‌బుక్ త‌ర్వాత అత్యంత వేగంగా ఎక్కువ మంది వాడుతున్న యాప్ కూడా ఇదే. దీనిలో ఉన్న ఫీచ‌ర్లు అంద‌రినీ త్వ‌ర‌గా క‌నెక్ట్ చేసింది. టెక్ట్స్ మెసేజ్‌, వాయిస్ మెసేజ్‌, ఫొటోలు, వీడియోలు, స్టేట‌స్, వాయిస్ కాల్, వాట్సాప్ వీడియో కాల్ లాంటి వాటితో పాటు.. మీమ్స్ ఉండ‌టం దీనికి బాగా క‌లిసొచ్చింది.

ఇక ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది వాట్సాప్‌. మొన్న‌టికి మొన్న వాయిస్ మెసేజ్‌ను క‌రెక్ట్ చేసుకునే ఫీచ‌ర్‌ను తీసుకొస్తున్న‌ట్టు చెప్పింది వాట్సాప్‌. అంటే మ‌నం వాయిస్ మెసేజ్ రికార్డు చేసి సెండ్ చేసేముందు అది స‌రిగ్గా ఉందో లేదో వినే ఆప్ష‌న్ అన్న‌మాట‌. దీన్ని త‌ర్వ‌లోనే తీసుకొస్తోంది.

ఇక ఇదిలా ఉండ‌గా ఇప్పుడు మ‌రో ఫీచ‌ర్ తీసుకొస్తున్న‌ట్టు వాట్సాప్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న మెసేజ్‌ల‌కు స‌రిప‌డా స్టిక్క‌ర్ల‌ను మ‌నమే వెతుక్కోవాల్సి వ‌చ్చేది. కానీ ఇక‌నుంచి మ‌నం ఏదైనా మెసేజ్ టైప్ చేస్తే దానికి స‌రిప‌డా స్టిక్క‌ర్‌ను ఇక నుంచి వాట్సాప్ స‌జెస్ట్ చేయ‌నుంది. ఎమోష‌న‌ల్‌, స్మైల్‌, బ్యూటిఫుల్ రెస్పెక్ట్ ఇలాంటి స్టిక్క‌ర్ల‌ను ఆటోమేటిగ్గా చూపిస్తుంద‌న్న‌మాట‌. కానీ దీనికి కొద్ది రోజుల టైమ్ ప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Latest news