దేశంలో ఎంత వాక్సిన్ అందుబాటులో ఉంది…? కేంద్రం లెక్కలు

-

దేశ వ్యాప్తంగా వాక్సిన్ కి సంబంధించి ఆందోళన ఉన్న సంగతి తెలిసిందే. వాక్సిన్ విషయంలో రాష్ట్రాలు అన్నీ కూడా సమర్ధవంతంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఇప్పట్లో సాధారణ పరిస్థితి వచ్చే విధంగా మాత్రం కనపడటం లేదు. ఇక వాక్సిన్ కేంద్రం సరిగా ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు విడుదల చేసింది.

రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉచితంగా 17.56 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేసింది అని తెలిపింది. రాష్టాలు ,కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 72 లక్షల వ్యాక్సిన్ మోతాదులు అందుబాటులో ఉన్నాయి అని వివరించింది. రానున్న మూడు రోజుల్లో మరో 46 లక్షల డోస్ లను అందిస్తాము అని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news