మీ మెదడు పనితీరు మెరుగవ్వడానికి చేయాల్సిన చిన్న చిన్న పనులు..

-

మెదడు పనితీరు బాగుంటే ఎక్కువ పనులు తక్కువ సమయంలో చేయగలం. పెద్ద పెద్ద వాళ్ళు చాలా పనుల్లో నిష్ణాతులు కావడానికి తమ మెదడు పనిచేసే తీరును మెరుగుపర్చుకోవడమే. మరి ఒక్కొక్కరికీ మెదడు ఒక్కోలా పనిచేస్తుంది. ఐతే దాన్ని మనం పెంచుకోవచ్చు కూడా. మనం ఎలా ఉన్నామనేది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనులే మన మెదడును ప్రభావితం చేస్తాయి. అందుకే మెదడుని చురుగ్గా చేయడానికి కొన్ని చిన్న చిన్న పనులను నేర్చుకుందాం.

వ్యతిరేక చేయితో పళ్ళు తోముకోవాలి.

సాధారణంగా మీకు ఏ చేయి అలవాటుందో ఆ చేయితో కాకుండా వేరే చేయితో బ్రష్ చేసుకోవాలి. దానివల్ల మెదడు మీద పని పడుతుంది. అప్పుడు మెదడులో ఉండే న్యూరాల్ కనెక్షన్స్ ఇంకా బలంగా తయారవుతాయి. దానివల్ల మెదడు చురుగ్గా అవుతుంది. సాధారణంగా వాడే చేయిని కాకుండా ఇతర చేయిని వాడితే మెదడు మీద మంచి ప్రభావం పడుతుంది.

మీకు తెలిసిన ఏదో ఒక మంత్రాన్ని ఐదునిమిషాల పాటు జపించండి.

మీకు దేవుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఒకే ఒక్క మీకు నచ్చిన పదం తీసుకుని దాన్ని ఐదు నిమిషాల పాటు జపిస్తూ ఉండండి. దానివల్ల ఒకే పని మీద ఎక్కువ సేపు దృష్టి ఎలా నిలపాలనేది అర్థం అవుతుంది. మెదడు దానికి బాగా అలవాటు అవుతుంది కూడా.

శరీరాన్ని అటు ఇటు వంచే వ్యాయామాలు కాకుండా నడక, జాగింగ్ లాంటివి చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడమే కాదు, సృజనాత్మక శక్తి వస్తుంది.

సరైన ఆహారం తీసుకోండి

మనం ఏం తింటున్నామనేది కూడా మన మెదడుని ప్రభావం చేస్తుంది. ఆకుకూరలు, నానబెట్టిన విత్తానాలు, విటమిన్ సి కలిగిన ఆహారాలని తీసుకోవడం ఉత్తమం. తాజా వాటినే తప్ప ఆల్రెడీ ప్రాసెస్ చేసిన వాటిని ఆహారంగా తీసుకోవద్దు.

నిటారుగా కూర్చోండి

అవును, మీరు కూర్చునే పద్దతి కూడా మీ మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. ఎల్లప్పుడూ నిటారుగా కూర్చోండి. కూర్చునేటపుడు వంగి కూర్చోవద్దు. అది అస్సలు మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news