ఆ హోటల్ లో దెయ్యాలు ఉన్నాయట.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు..!

-

కొందరికి దెయ్యాలకథలంటే భలే ఇంట్రస్ట్ ఉంటుంది కదా..కానీ ఎలాంటి ఆధారాలు లేని కథలలో కిక్కేముంటుంది. ఏదో మనల్ని భయపెట్టడానికి చెబుతున్నారు అనిపిస్తుంది. అదే ఏదైనా ఆధారం ఉండి, మీ ఫ్రెండ్ కో లేదా మరెవరికో దెయ్యం కనిపిస్తే అదే విషయాన్ని మీకు చెబుతుంటే..ఆహా ఎంత ఆత్రుతగా వింటామో. ఇప్పుడూ ఆధారాలతో దొరికిపోయిన ఓ దెయ్యం గురించి చెబుతాను..బాగా వినండి మరీ. ఆ హోటల్ లో దెయ్యం ఉందట.ఆ విషయాన్ని స్వయంగా హోటల్ కి వచ్చిన కస్టమర్లే ఏం జరిగిందో చెప్పారు. హోటల్ సిబ్బంది కూడా దెయ్యాలున్నాయని బలంగా చెబుతుంటే..ఇక ఆ యజమాని ఏం చేస్తాడు దర్యాప్తు చేయించాడు. అప్పుడేం జరిగిందంటే.

దక్షిణ పశ్చిమ ఇంగ్లండ్‌ సోమర్‌సెట్‌లోని ఇల్మినిస్టర్ ప్రాంతంలో ఉందో ష్రుబ్బెరీ హోటల్. ఈ హోటల్‌లో చాలా కాలంగా దెయ్యాలు ఉన్నాయనే కథలు ఉన్నాయి గానీ… వాటిని ఎవరూ పెద్గా సీరియస్‌గా తీసుకోలేదు. దానికి తోడు హోటల్ బయటికి పాతదిలా ఉన్నా లోపల మాత్రం ఇంద్రభవనంలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దెయ్యాలూ లేవూ ఏమీ లేవు అనుకుంటూ అతిథులు హాయిగా స్టే చేసేవారు.

కానీ తాజాగా ఈ హోటల్‌లో మెట్ల దగ్గర ఎవరో నడిచినట్లు టక్ టక్ టక్ టక్ మని శబ్దాలు వచ్చాయి. వాటిని కొందరు గెస్టులు విన్నారు. మొదట వాళ్లు ఆశ్చర్యపోయారు. మెట్ల దగ్గర ఎవరూ లేనప్పుడు శబ్దాలు ఎలా వచ్చాయి. ఎవరో నడిచినట్లుగా మనకు ఎందుకు వినిపించింది అని అనుకున్నారు. ఇక ఉంటారా ఉండరు కదా.. వాళ్లలోనే ఒకరు దెయ్యాల ప్రస్తావన తెచ్చారు. దాంతో అంతా ఉలిక్కిపడ్డారు. సీన్ ఇక్కడితో అయిపోలేదుగా..

కొంత మంది గెస్టుల జుట్టు ఎవరో లాగారు. నువ్వు లాగావా… నువ్వు లాగావా అని వాళ్లలో వాళ్లు కనుక్కోగా ఎవరికి వాళ్లు నేను లాగలేదు అనే చెప్పారు. మరైతే లాగింది ఎవరు అంతే… మళ్లీ అదే దెయ్యాల ప్రస్థావన… అదే ఉలిక్కిపాటు. అ

ఇంకోసారి.. ఈ హోటల్‌లోని కొన్ని గదులు ఖాళీగా ఉన్నాయి. ఆ గదుల నుంచి రిసెప్షన్‌లో ఉన్న ఫోన్‌కి కాల్స్ వచ్చాయి. నిజానికి ఆ గదులన్నీ లాక్ వేసి ఉన్నాయి. మరి కాల్స్ ఎలా వచ్చాయి. అథితులు చెప్పారంటే నమ్మలేముగానీ ఈ కాల్స్ రావడం అనేది అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అంతే ఇగ..వీటితో హోటల్ అంత రచ్చరచ్చ..హోటల్ యాజమాన్యం ఎవరికో కాల్ చేసింది. కాల్ అందుకున్న వారు ఆదివారం సాయంత్రం హోటల్‌కి వచ్చారు.సోమర్‌సెట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ యూకే . వాళ్లు..అదేనండి దెయ్యాలను వేటాడి కనిపెట్టేవాళ్లు. అంతా తిరిగారు..సంథింగ్ తేడాగా ఉంది ఆ వాయిస్ వినిపించింది అన్నారు.

హోటల్ మేనేజర్ ఆ హోటల్‌ చరిత్ర చెప్పాడు. ఇదివరకు కూడా ఇలాంటి దెయ్యాల ఘటనలు జరిగాయని చెప్పాడు. ముఖ్యంగా హోటల్ లోని డైనింగ్ రూమ్‌లో తరచూ ఓ పెద్ద మనిషి ఆకారం కనిపిస్తోందట. అతన్ని కావలియర్ అంటున్నారు. కావలియర్ అంటే తెలుగులో రాజు ఆస్థానంలోని ఉన్నత స్థాయి అధికారి అని అర్థం. అతనితోపాటూ అప్పుడప్పుడూ హోటల్‌లో వింత శబ్దాలు వినిపిస్తాయట. అంతేకాదండోయ్… కిచెన్, సెల్లార్‌లో ఎవరో టచ్ చేసినట్లు అనిపిస్తుందట. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించరు. ఎందుకో మనకు తెలుసు!… ఇక ఈ హోటల్ పాత ఓనర్ కూడా తరచూ అక్కడక్కడా కనిపిస్తాడట.సరిగ్గా దెయ్యాల సినిమాకు సరిపోయేలా ఉంది కదా..ఈ సీన్న్ అన్నీ.

పరిశోధకులు మీరు అటు వెళ్లండి మేము ఇటు వెళ్తాం మీరు ఇక్కడే ఉండండి అని అనుకుంటూ రకరకాల ప్లేసుల్లో వెతికారు. వాళ్ల దగ్గర కుయ్ మనే పరికరాలు ఉంటాయి కదా… వాటిని వాడారు. వాకీ టాకీలు ఉపయోగించారు. వాళ్లకు ఎలిజబెత్ వాయిస్ వినిపించిందట. ఎలిజబెత్ అంటే… హోటల్ మొదటి ఓనర్ భార్య. ఇప్పుడు ఆ హోటల్‌లో ఉండాలా వద్దా అనేది అతిథులు ఆలోచించుకుంటున్నారు. ఇదంతా ఎవరైనా కావాలని చేస్తున్నారా… నిజంగానే జరుగుతోందా అనేది ఇంకా తేలాల్సి ఉంది.

మొత్తానికైతే ఆ హోటల్లో ఏదో తేడాగానే ఉంది. దర్యాప్తు మొత్తం పూర్తయ్యోలోపు ఇంకెన్నీ జరుగుతాయో.

Read more RELATED
Recommended to you

Latest news