ఆ గేదే వీర్యానికి భారీ డిమాండ్.. మూడు రాష్ట్రాల్లో దీని సంతానమే.!

-

ఈరోజుల్లో మనుషుల వీర్యానికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. కొన్ని దేశాల్లో ఇది చట్టవిరుద్ధం కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఇది లీగలే. మనుషుల వీర్యం గురించి తెలుసు.. కానీ ఇక్కడ ఓ గేద వీర్యానికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఏకంగా కొన్ని రాష్ట్రాలకు సప్లైయ్‌ చేస్తున్నారు. రాజస్థాన్‌లో రాజా అనే గేదె పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని చూసేందుకు స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు వస్తున్నారు. ఈ రెడ్యా రాజా రూపమే కాదు దాని వీర్యానికి కూడా దేశ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది.

ఈ మూడున్న సంవత్సరాల వయసున్న జెయింట్ రెడ్యా 5 అడుగుల 8 అంగుళాల పొడవు ఉంది. 1300 నుంచి 1400 కిలోల బరువు ఉంది. అతని బాధ్యత కారణంగా యజమానులు అతనికి ‘రాజా’ అని పేరు పెట్టారు. ఈ గేదె వీర్యానికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ గేదె వీర్యం రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లలో విస్తృతంగా అమ్ముడవుతోందట. వీర్యం విక్రయం ద్వారా వచ్చే ఏడాది నాటికి ఒక్క రాజస్థాన్‌లోనే దాదాపు 8,000 లేగ దూడలు పుట్టవచ్చని యజమానులు చెబుతున్నారు. కాబట్టి రాజా హర్యానా, పంజాబ్‌లలో కలిపి 11000 సంతానానికి ఈ రాజానే తండ్రి

రాజా పోషించడానికి యజమానులు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ గేదకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 4-4 లీటర్ల పాలు ఇస్తారు. తిన్న తర్వాత 3 నుంచి 4 కిలోమీటర్లు నడిచి తీసుకెళ్లాలి. చురు జిల్లాలోని బీస్లాన్ గ్రామంలో పెరిగిన ఈ రాజు తల్లిదండ్రులు కూడా ప్రసిద్ధులు. ఆ గేదల తల్లి రోజుకు 24 కిలోల 800 గ్రాముల పాలు ఇచ్చేది.

ఉదయపూర్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న కిసాన్ మహోత్సవ్‌లో రాజా సెంటరాఫ్ అట్రాక్షన్ మారింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. అందరి చూపూ ఈ గేదపైనే. ఒక గేద ఇన్ని కేజీల బరువు ఉండటం దానీ వీర్యానికి అంత డిమాండ్‌ ఉండటం అంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది కదూ.!

Read more RELATED
Recommended to you

Latest news