యూపీలో మరో ప్రజోపయోగ కార్యక్రమం సీఎం యోగి చొరవతో పేదలకు ఇళ్ళు

-

మాఫియాను కూకటివేళ్ళతో సహా పెకలిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆడిత్యనాథ్ మరో ప్రజోపయోగ కార్యక్రమం చేపట్టారు. మాఫియా చెర నుంచి లాక్కున్న భూములను పేదలకు ఇళ్ళు స్థలలుగా పంచి పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. స్వాధీనం చేసుకున్న భూములను ప్లాట్లుగా మార్చి ప్రజలకు పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సొంతం చేసుకున్న భూములను సిద్ధం చేయాలని సూచించారు.

లుకర్‌గంజ్‌లో మాఫియా లీడర్ అతిక్ అహ్మద్ ఖాళీ చేసిన స్థలంలో పీఎం అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద వేగంగా ఇళ్లను నిర్మించారు. ఆ ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు పంచేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జులై మొదటి వారంలో లబ్ధిదారులకు కేటాయించిన ఫ్లాట్ల తాళాలను అందజేసేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్నారు. సీఎం పర్యటన ప్రతిపాదిన దృష్ట్యా ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

లుకర్‌గంజ్‌లోని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద సిద్ధం చేసిన 76 ఫ్లాట్లను లబ్ధిదారులకు ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ పూర్తి చేసింది. అప్పటి నుంచి లబ్ధిదారులు ఫ్లాట్ల తాళాలు కోసం ఎదురు చూస్తున్నారు. కీలకమైన పంపిణీని సీఎం యోగి ఆదిత్యనాథ్ చేత చేయించేందుకు పీడీఏతోపాటు జిల్లా యంత్రాంగం అధికారులు సిద్ధమయ్యారు.

సీఎం కార్యక్రమం కోసం బుధవారం లుకర్‌గంజ్‌లో నిర్మించిన ఫ్లాట్లను డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, డీఎం సంజయ్ కుమార్ ఖత్రి, పీడీఏ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ చౌహాన్, ఇతర పీడీఏ అధికారులు పరిశీలించారు. దీని తరువాత, లుకర్‌గంజ్‌లోని లుకర్‌గంజ్ క్లబ్ సమీపంలో సిద్ధంగా ప్లాట్లను కూడా తనిఖీ చేశారు. పీడీఏ తరఫున వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం 20 మంది లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా తాళాలు పంపిణీ చేయనున్నారు. ఇందులో దివ్యాంగులు, వితంతువులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు.అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ అటల్ రెసిడెన్షియల్ స్కూల్ సహా దాదాపు రూ.750 కోట్ల విలువైన 200కు పైగా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడంతో పాటు కబ్జా నుంచి విముక్తి పొందిన భూమిలో నిర్మించిన ఇళ్ల తాళపత్రాలను అందజేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news