శృంగారం: భావప్రాప్తి కోసం మహిళలు ఏమేం కోరుకుంటారో తెలుసా?

-

శృంగారంలో ఆనందపు అంచులను అందుకోవడం చాలా ముఖ్యం. అది కూడా భాగస్వాములిద్దరూ అందుకుంటేనే దానికి పరిపూర్ణత వస్తుంది. చాలామంది మహిళల భావప్రాప్తి విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుతం మహిళలు భావప్రాప్తి చేరుకోవడానికి ఏమేం కోరుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం.

ఫోర్ ప్లే

చాలామంది మగవాళ్ళు చేసే తప్పు ఇదే. ఫోర్ ప్లే చేయకుండా మొదలు పెట్టేస్తారు. కానీ మహిళలు భావప్రాప్తికి చేరుకోవాలంటే ఫోర్ ప్లే కీలక పాత్ర వహిస్తుంది. ముద్దు నుండి మొదలు పెడితే ఆ రోజులో వాళ్ళు చేసే ప్రతీ పనిలో సాయం చేయడమూ ఫోర్ ప్లే కిందకే వస్తుంది.

ఓపిక

శృంగారంలో ఓపిక చాలా అవసరం. అవతలి వారిని భావప్రాప్తికి చేర్చేందుకు ఇది ప్రముఖమైనది. మీకోసం మాత్రమే కాకుండా ఇద్దరూ కూడా ఆనందపు అంచులను చేరుకునే వరకు ఓపికగా ఉండాలి.

జ్ఞానం

మహిళల శరీరం గురించి కొంచెమైనా తెలిసి ఉండాలి. చాలామందికి క్లైటోరిస్ స్థానం ఎక్కడ అనేది తెలియదు. అందుకే శృంగారానికి రెడీ అయ్యే ముందు మహిళల శరీర నిర్మాణం గురించి కొద్దిగానైనా తెలుసుకోవాలి.

కమ్యూనికేషన్

భాగస్వాములు భావప్రాప్తి చేరుకోవాలంటే, వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా ఉండాలి. బెడ్ మీద మీకెలా బాగుంటుందో అవతలి వారికి చెప్పగలగాలి. అలాగే అవతలి వారు చెబుతున్న దాన్ని అర్థం చేసుకుని దానికి తగినట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకున్నప్పుడు భావప్రాప్తికి సులభంగా చేరుకోగలుగుతారు.

నిస్వార్థం

పడకగదిలో నీది నాది అన్న తేడాలు కనిపించినపుడు భావప్రాప్తికి చేరుకోవడం కష్టం అవుతుంది. మీ సంతోషం మాత్రమే కాదు అవతలి వారి కోసం ఆలోచించినపుడే భావప్రాప్తి సాధ్యం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version