హెల్మెట్ ధరించలేద‌ని.. ట్రాక్టర్ డ్రైవర్‌కు జరిమానా

-

హెల్మెట్ ధరించకుండా ట్రాక్టర్ నడిపినందుకు రూ.3 వేల జరిమానా చెల్లించాలంటూ ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు నోటీసులు పంపారు. హెల్మెట్ లేకుండా ట్రాక్టర్ నడపడంతోపాటు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా దగ్గర లేనందుకు ఈ-చలాన్ విధించినట్టు నోటీసులు పంపారు. ట్రాక్టర్‌పై హెల్మెట్ పెట్టుకోనందుకు జరిమానా ఏంటంటూ సదరు డ్రైవర్ ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో వాదనకు దిగినా ప్రయోజనం దక్కలేదు. ట్రాఫిక్ అధికారి సైతం అతడు చెప్పేది ఏమాత్రం వినిపించుకోకుండా పెడచెవిన పెట్టారని బాధితుడు వాపోయాడు.

ఈ వ్యవహారాన్ని అతడు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో వైరల్‌గా మారింది. అధికారులు హుటాహుటిన స్పందించి అతడి చలాన్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి అతడి దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదని చలాన్‌లో పేర్కొన్నప్పటికీ పోలీసులు వదిలేయడం గమనార్హం. అలాగే అధికారులు కంప్యూటర్ నమోదులో లోపం కారణంగా అలా జరిగిందని పేర్కొంటూ చలాన్ రద్దు చేశార‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news