బిగ్‌బాస్ కాన్సెప్టే నచ్చదన్న నాగార్జునే ఇప్పుడు హోస్ట్.. నెటిజన్ల ట్రోలింగ్‌ స్టార్ట్‌..!

-

నాగార్జున ఎప్పుడైతే బిగ్‌బాస్ సీజన్ 3కి హోస్ట్‌గా ఎంపిక అయ్యారని అఫిషియల్‌గా తెలిసిందో.. నెటిజన్లు మాత్రం ఆగడం లేదు. అస్సలు ఆగడం లేదు. సోషల్ మీడియాలో తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.

ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో బిగ్ బాస్ షో గురించే చర్చ. జులై 21 నుంచి ఈ షో మూడో సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. నాగార్జునే మూడో సీజన్ హోస్ట్ అని స్టార్ మా యాజమాన్యం ఆఫిషియల్‌గా కన్ఫమ్ చేసింది. నిన్న నాగార్జునే హోస్ట్ అంటూ ఓ ప్రోమోను కూడా విడుదల చేసింది. ఈసారి 14 మంది కంటెస్టెంట్లు 100 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండబోతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ల సెలక్షన్ అయిపోయిందట.

కాకపోతే.. వాళ్లు ఎవరు అనే విషయాన్ని మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులు రివీల్ చేయలేదు. అది సస్పెన్స్‌గానే ఉంది. కాకపోతే.. నెటిజన్లు మాత్రం తమ బుర్రకు పదును పెట్టి.. ఇదిగో ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండబోయిది వీళ్లే అంటూ ఓ లిస్టును వైరల్ చేస్తున్నారు. ఆ లిస్ట్ ఎంతవరకు నిజం.. ఎంతవరకు అబద్ధం అనేది తెలియాలంటే.. జులై 21 దాకా ఆగాల్సిందే. ఆరోజే మొదటి ఎపిసోడ్ ప్రారంభం కానుంది. ఆరోజు కంటెస్టెంట్ల పరిచయం, వాళ్లు హౌజ్‌లోకి వెళ్లే సీన్లు చూపిస్తారు.

అయితే.. నాగార్జున ఎప్పుడైతే బిగ్‌బాస్ సీజన్ 3కి హోస్ట్‌గా ఎంపిక అయ్యారని అఫిషియల్‌గా తెలిసిందో.. నెటిజన్లు మాత్రం ఆగడం లేదు. అస్సలు ఆగడం లేదు. సోషల్ మీడియాలో తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. నాకు బిగ్‌బాస్ కాన్సెప్టే నచ్చదు. బిగ్ బాస్ షో గురించే నన్ను అడగొద్దు. నేను బ్యాడ్‌గా మాట్లాడుతా. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడో తొంగి చూడటం నచ్చదు.. అంటూ అప్పుడు వయ్యారాలు పలికి.. ఇప్పుడు అదే షోకు హోస్ట్‌గా ఎలా వెళ్లావు నాగార్జున అంటూ ట్రోల్ చేస్తున్నారు.

నాగార్జున నటించిన దేవదాసు సినిమా ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను వైరల్ చేస్తూ నెటిజన్లు నాగార్జునతో ఓ ఆట ఆడుకుంటున్నారు. షో స్టార్ట్ కాకముందే నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు. ఇక మున్ముందు ఎన్ని సమస్యలను నాగ్ ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news