మిర్యాలగూడ ఘటన తెలుగు రాష్ర్టాల్లో ఎంతటి సంచలనమైందో తెలిసిందే. ప్రణయ్-అమృతల పాలిట విలన్ గా మారుతిరావు చరిత్రలోకి ఎక్కాడు. ప్రణయ్ ని అత్యంత కర్కశంగా మట్టు బెట్టించి క్రూర తండ్రిగా నిలిచాడు. మట్టు బెట్టే పథకంలో భాగంగా కూతురితో తెలివిగా మాట్లాడి స్కేచ్ వేసి మరీ ఆసుపత్రి ముందు అతి కిరాతకంగా కిరాయి రౌడీతో నరికి చంపించాడు. కూతురి ప్రేమ కన్నా కుటుంబం పరువే ముఖ్యమైని ప్రపంచానికి చాటి చెప్పాడు. తాజాగా ఈ ఘటన ఆధారంగా…ప్రణయ్-అమృత పాత్రలను బేస్ చేసుకుని ఓ సినిమా చేసారని తెలుస్తోంది. ఆ సినిమా పేరు `ప్రేమ జంట`. ప్రణయ్-అమృత లవ్ స్టోరీకి ఈ కథ దగ్గర ఉంది. హీరో నిమ్న కులస్తుడు. చదువులో తెలివైన వాడు.
హీరోయిన్ ది అగ్ర కులం. స్కూల్ డేస్ నుంచే ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంటర్మీడియట్ లవ్ ప్రపోజ్ చేస్తాడు. అబ్బాయి తెలివి తేటలకి అమ్మాయి ప్లాట్. ఆ విషయం ఇంట్లో పెద్దలకు తెలిసి పోవడంతో లేచిపోయి జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ అనుకోకుండా ప్రేమికుల రోజున భజరంగ్ దళ్ గ్యాంగ్ పెళ్లి చేసేస్తుంది. తర్వాత హ్యాపీగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి హీరోయిన్ తండ్రి ఎంటర్ అవుతాడు. ఈ విషయం ఊళ్లో తెలిస్తే పరువు పోతుందని, కులం పిచ్చితో హీరోయిన్ తండ్రి కొత్త దంపతులు ఇద్దర్నీ చంపేయాలనుకుంటాడు. ఈ క్రమంలో కూతురుతో రాజీకి వచ్చినట్లు నటించి అల్లుడిపై ఎటాక్ చేయిస్తాడు.
తెలంంగాణ రాష్ర్టంలో జరిగిన కొన్ని సంఘటనలు.. పరువు హత్యలను, మిర్యాలగూడ ఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు ఈ కథను రాసినట్లు తెలుస్తోంది . అయితే మిర్యాల గూడ ఘటన సంచలనమైంది. ప్రస్తుతం దానిపై కేసు నడుస్తోన్న నేపథ్యంలో ఆ పాయింట్ ను ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ కథకు మూలం ఆ ఘటనేనని రివ్యూ రైటర్ల అభిప్రాయం. సినిమాటిక్ టచ్ ఇచ్చి చేసాడు. కొన్ని సన్నివేశాలు వాస్తవికంగా బాగున్నాయి. యూత్ కి నచ్చే సినిమా అవుతుందని దర్శక, నిర్మాతలు ధీమా వ్యక్తం చేసారు.