ట్రంప్ ప్రసంగించే స్టేడియం ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు…!

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ భారత్ లో అడుగుపెట్టిన క్షణం నుంచి కూడా ట్రంప్… మోడీ పక్కనే ఉంటూ సబర్మతి ఆశ్రమం విశేషాలను వివరించారు. విమానాశ్రయం నుంచి కూడా ట్రంప్ పక్కనే ఉన్నారు మోడీ. సబర్మతి ఆశ్రమంలో గాంధీ జీవన విధానాన్ని ట్రంప్ కి మోడీ వివరించారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్ తో ట్రంప్ మోతెరా స్టేడియానికి వచ్చారు.

ఇక అది అలా ఉంటే ఇప్పుడు నమస్తే ట్రంప్ ప్రసంగానికి వేదిక అయిన మోతెరా స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియ౦. మోడీ డ్రీం ప్రాజెక్ట్స్ లో ఇది కూడా ఒకటిగా ఉంది. క్రికెట్ మక్కా లార్డ్స్ కంటే ఈ స్టేడియం అతి పెద్దది. మోటేరాలో 1.10 లక్షల మంది కూర్చుని ఒకేసారి మ్యాచ్ చూసేలా స్టేడియం రూపొందించారు. ఈ స్టేడియం ఖర్చు దాదాపుగా 700 కోట్లు అయినట్లు తెలుస్తుంది.

ఈ స్టేడియంలో వాటర్ మేనేజిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా స్టేడియంలోని ఒక్క చుక్క నీరు కూడా వృధా కాదట. దాదాపుగా 3000 కార్లు 10 వేల ద్విచక్ర వాహనాలు పార్కింగ్ కు అనువుగా స్టేడియం రూపకల్పన చేసినట్లు తెలుస్తుంది. ఈ స్టేడియం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ట్రంప్ అక్కడికి అడుగు పెట్టగానే ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. నమస్తే ట్రంప్ అంటూ  అందరూ స్వాగతం పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news