టూత్‌ బ్రష్‌తో జైలు గోడలకు కన్నం వేసి ఇద్దరు ఖైదీలు జంప్‌

-

జైలు నుంచి తప్పించుకునేందుకు ఖైదీలు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.. తినడానికి ఇచ్చిన ప్లేట్‌తో గోడలను గీకడం, ఆరోగ్యంపాడైనట్లు నాటకం ఆడటం, కూరగాయవ్యాన్‌లో దాక్కోవడం ఇవన్నీ మనం సినిమాల్లో చూశాం..కానీ రియల్‌గా జైలు నుంచి పారియోందుకు ఇద్దరు ఖైదీలు చేసిన పని ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలా కూడా పారిపోవచ్చా అని మీరు షాక్‌ అవుతారం.. టూత్‌ బ్రష్‌ను ఉపయోగించి ఆ ఖైదీలు ఏకంగా జైలు గోడకే కన్నం వేశారు. ఆ కన్నం ద్వారా పారిపోయారు కూడా.. అమెరికాలోని(USA) వర్జీనియా రాష్ట్రంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

జాన్ గార్జా(37), అర్లె నెమో(43) అనే ఇద్దరు వ్యక్తులను వేర్వేరు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కోర్టు ధిక్కారం, అతని పర్యవేక్షణ నిబంధనలను ఉల్లంఘించడం వంటి అనేక నేరాల కారణంగా గార్జా జైలు పాలయ్యాడు. కోర్టు ధిక్కారం, ఫోర్జరీ, క్రెడిట్ కార్డ్ మోసం, క్రెడిట్ కార్డ్ దొంగిలించడం, దొంగతనానికి సంబంధించిన పనిముట్లను కలిగి ఉండటం వంటి అనేక కేసుల్లో నెమోను అదుపులోకి తీసుకున్నారు. అయితే జైలు నుంచి తప్పించుకునేందుకు ఈ ఇద్దరు ఖైదీలు ఓ మాస్టర్ ఫ్లాన్ వేశారు. ఇందుకోసం వారు టూత్ బ్రష్‌నే ఆయుధంగా మార్చుకున్నారు. కొద్ది రోజులుగా టూత్ బ్రష్, లోహపు వస్తువు సాయంతో జైలు గోడకు రంధ్రం చేసి అదను చూసి పారిపోయారు. జైలు నుండి ఏడు మైళ్ల దూరంలో ఉన్న ఇంటర్నేషనల్ హోమ్ ఆఫ్ పాన్‌కేక్స్ అవుట్‌లెట్‌ను సందర్శించి..పాన్ కేకులు తినడం మొదలుపెట్టారు. కొన్ని గంటల తర్వాత జైలులో ఖైదీలకు అటెండెన్స్ వేస్తున్న సమయంలో ఇద్దరు ఖైదీలు తక్కువ అయ్యారు. చూస్తే గార్జా, నెమో అని అధికారులకు అర్థమైంది. అంతే పారిపోయిన ఆ ఇద్దరు ఖైదీలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఇదే సమయంలో నిందితులను గుర్తించిన రెస్టారెంట్‌లోని కస్టమర్లు పోలీసులకు సమాచారం అందించారు.

హాంప్టన్ పోలీసులు IHOP అవుట్‌లెట్ వద్దకు చేరుకుని ఎటువంటి ప్రమాదం జరగకుండా వారిద్దరినీ అరెస్టు చేశారు. మరోవైపు, టూత్ బ్రష్ తో జైలు గోడకు కన్నం వేసి ఖైదీలు పారిపోవడం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జైలు గోడలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండటాన్ని గుర్తించి వెంటనే మరమ్మతులు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news