మహర్షి టీజర్.. ఓడిపోతావ్ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు..!

-

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. ఈరోజు ఉగాది సందర్భంగా ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు. స్టాంగ్ కంటెంట్ బేస్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఇక టీజర్ విషయానికి వస్తే మహేష్ ఓ పక్క స్టూడెంట్ గా మరో పక్క కంపెనీ సి.ఈ.వోగా కనిపించాడు. ముఖ్యంగా నాకో ప్రాబ్లెం ఉంది సార్.. ఓడిపోతావ్ అంటే గెలిచి చూపిచడం నాకు అలవాటు అనే డైలాగ్ అదరగొట్టిది. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్ అవుతుంది. ఉగాది రోజున మహేష్ టీజర్ తో తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అదరగొట్టేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news