క‌ష్టాల్లో Tik Tok App… రూ.40 కోట్ల ఫైన్ వేసిన యూఎస్

-

చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ తెలుసు కదా. ఆ యాప్‌కు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ ఉంది. అయితే.. ఈ యాప్‌కు ఉన్న క్రేజ్ కారణంగా దీన్ని పాజిటివ్‌గా కాకుండా నెగెటివ్‌గానే ఎక్కువగా వాడుతున్నారు. ఈ యాప్‌లో బూతు రోజు రోజుకూ ఎక్కువై పోతోంది. ఇటీవలే ఓ కుర్రాడు టిక్ టాక్‌లో వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఇలా టిక్ టాక్ మాయలో పడి నేటి యువత పెడదారి పడుతున్నదనడంలో సందేహమే లేదు. ఈనేపథ్యంలో యూఎస్.. టిక్ టాప్ యాప్‌పై కొరడా ఝుళిపించింది. రూల్స్ సరిగా పాటించనందుకు టిక్ టాక్ యాజమాన్యానికి రూ.40.6 కోట్ల ఫైన్ వేసింది.

యూఎస్‌లోనూ టిక్ టాక్‌కు యూజర్లు ఉన్నారు. అక్కడ కూడా బాగానే పేరు వచ్చింది టిక్‌టాక్‌కు. అయితే.. యూఎస్ చట్టాల ప్రకారం.. 13 ఏళ్ల లోపు పిల్లల వ్యక్తిగత వివరాలను బయటపెట్టకూడదు. కానీ.. టిక్‌టాక్ యాప్‌లో 13 ఏళ్ల లోపు పిల్లలు వీడియోలు, ఫోటోలు, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవడం… పిల్లల భద్రతా చట్టాన్ని అతిక్రమించినట్టేనని భావించిన అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్.. టిక్‌టాక్‌కు ఫైన్ వేసింది. కానీ.. టిక్‌టాక్ దీనిపై స్పందిస్తూ.. తాము రూల్స్‌ను ఎక్కడా బ్రేక్ చేయలేదని వాదిస్తోంది. ఫైన్ కట్టేది లేదంటూ స్పష్టం చేసింది. యూఎస్‌లో 6.5 కోట్ల మంది టిక్ టాక్ యూజర్లు ఉన్నారు. అయితే.. ట్రేడ్ కమిషన్ మాత్రం ఫైన్ కట్టాల్సిందేనని లేదంటే టిక్ టాక్ యాజమాన్యానికి జైలే గతి అని హెచ్చరిస్తోంది. ఈనేపథ్యంలో టిక్ టాక్ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version