వైరల్‌ వీడియో: అక్రమ మద్యం కేసులో చిలుక జోష్యంపై ఆధారపడిన బీహార్‌ పోలీసులు..

-

బీహార్‌ పోలీసులు రామచిలుకను అరెస్ట్ చేశారు. అది కూడా అక్రమ మద్యం కేసులో.. అంటే చిలుక అక్రమ మద్యం విక్రయిస్తుందా ఏంటీ..? అది ఎలా జరుగుతుంది.. నిజానికి ఈ కేసులో చిలుక చేసిన నేరం ఏం లేదు.. పోలీసులు నేరస్తుల్ని పట్టుకోవడానికి తమ తెలివి తేటలు ఉపయోగించకుండా చిలుక జోస్యంపై ఆధారపడ్డారు.. అసలు జరిగిన విషయం ఏంటంటే..
గయాలోని గురువా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ మారుమూల గ్రామంలో అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఇన్స్‌పెక్టర్ కన్హయ్య కుమార్ తన పోలీసు బృందాన్ని తీసుకొని నేరస్తుడ్ని పట్టుకోవడానికి అతని ఇంటిపై రైడ్ చేశారు. అయితే పోలీసులు వచ్చిన విషయాన్ని చిలుక గమనించి తన పలుకులతో యజమానికి సంకేతం ఇవ్వడంతో మద్యం అమ్ముతున్న వ్యక్తి అమృత్ మల్లా కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సీక్రెట్‌గా వెళ్లినా నేరస్తులు ఎలా తప్పించుకున్నారని పోలీసులకు అనుమానం వచ్చింది.. ఇంటి వరండాలో ఉన్న రామచిలుక పోలీసుల్ని చూసి అరవడం కనిపించింది. అంతే ఇదే వాళ్లకు సంకేతాలు ఇచ్చి తప్పించుకునేలా చేసిందని భావించారు. వెంటనే రామచిలుకను బోనులో బంధించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. యజమాని ఆచూకి ఏమైనా తన చిలక పలుకులతో చెబుతుందని స్టేషన్‌కు తెచ్చినప్పటికి అది మాత్రం నోరు విప్పడం లేదు.
ఒక నేరస్తుడైన యజమానిని కాపాడేందుకు రామచిలుక చూపిస్తున్న స్వామిభక్తిని చూసి పోలీసులు షాక్ అవుతున్నారు. లేదంటే రామచిలుక తన యజమాని గొంతు వింటే గుర్తు పట్టే అవకాశం ఉంటుందని బావిస్తున్నారు. అందుకే రూపు బౌల్స్ తప్ప మరేం మాట్లాడలేదు. గురువా పోలీసు చిలుక నుండి మద్యం వ్యాపారి అమృత్ మల్లా ఎక్కడికి వెళ్లాడు? పదే పదే అడుగుతున్నా చిలుక నుంచి సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.
అయితే పోలీసులు ఓ అక్రమ మద్యం తయారి వ్యాపారిని అరెస్ట్ చేసే విషయంలో మూగజీవిని బంధించడం స్థానికులు సీక్రెట్‌గా వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అంతే ఈ వీడియో ఘోరంగా వైరల్‌ అయింది.. పోలీసుల తీరును అందరూ తప్పుపడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news