వైర‌ల్ వీడియోః ఇంటి చుట్టూ తిరుగుతున్న ద‌య్యం నీడ‌.. !

-

ఈ సృష్టిలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌ర‌మూ చెప్ప‌లేం. కొన్ని ఘ‌ట‌న‌లు చూస్తుంటే మ‌న కండ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేక‌పోతుంటాం. ఎందుకంటే అవి మ‌న ఊహ‌కు కూడ అందకుండా ఉంటాయి. అస‌లు నిజంగా అలా జ‌ర‌గ‌ద‌ని వాదించే మ‌న‌కే అలాంటి ఘ‌ట‌న‌లు కండ్లు తెరిపిస్తుంటాయి. ఇక ఇప్పుడు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఒక వీడియో జ‌నాల‌ను నిలువునా వ‌ణికిస్తోంది. అదేంటో ఇప్ప‌డు తెలుసుకుందాం.

నిజానికి అది ఒక పొగ రూపంలో ఉన్న నీడ ఇంటి చుట్టూ తిరుగుతున్న‌ట్టు ఉంది ఆ సీసీటీవీ కెమెరా వీడియోలో. దాన్ని చూసిన‌ ఓ మహిళ నిలువునా హ‌డ‌లెత్తింది. ఎందుకంటే ప‌ట్ట‌ప‌గ‌లు త‌న ఇంటి చుట్టూ ఓ వింత ఆకారం తిరుగుతుండ‌టంతో ఆమె భ‌య‌ప‌డి ఓ మ‌తాధికారిని పిలిచి ఆ వీడియోను చూపించిన అస‌లు విష‌యం మొత్తం చెప్పింది.

అయితే ఈ ఘ‌ట‌న స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్గో గ‌న‌ర సమీపంలోని బారోఫీల్డ్‌లో జ‌రిగింది. ఇక్క‌డ స్థానికంగా ఉంటున్న మాక్సిన్ హ్యూస్ అనే మహిళ ఇంటి చుట్టూ తిరుగుతున్న పొగ రూపాన్ని త‌న సీసీటీవీ కెమెరా వీడియోల్లో బ‌య‌ట ప‌డింది. ఇంటి గార్డెన్‌లో తాను పార్క్ చేసిన కారవాన్ ద‌గ్గ‌ర ఆ పొగ రూపంలో ఉన్న ఆకారం తిరుగుతోంది. ఇక తాను ఇలాంటి వింత ఆకారాలను గ‌తంలో కూడా త‌న ఇంటి చుట్టూ చూశాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news