డుకాన్‌ డైట్‌ అంటే ఏంటి..? బ్రిటన్‌ యువరాణి ఇది ఫాలో అయ్యే అలా ఉన్నారా..!!

-

బరువు తగ్గడం టార్గెట్‌ అయితే.. అందులో రకరకాల డైట్‌లు ఉన్నాయి. డైట్లలో డుకాన్ డైట్ ఒకటి. బ్రిటన్ యువరాణి, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్ ఈ డైట్‌నే ఫాలో అవుతుంది. ముగ్గురు పిల్లలు తల్లి అయినా మెరుపు తీగలా కనిపించడమే ఆమె ప్రత్యేకత. ఆమె తినే ఆహారం, వ్యాయామం ఆమెను ఇలా కనిపించేలా చేస్తాయి. ఇంతకీ డుకాన్‌ డైట్‌ అంటే ఏంటి..?
ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన మహిళల్లో కేట్ కూడా ఒకరు. ఆమె ఏం తింటుందో వెతికే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు.. ప్రస్తుతం ఆమె డుకాన్ డైట్‌ను ఫాలో అవుతున్నట్టు తెలిసింది.. అధిక ప్రోటీన్ ఉండడం ఈ డైట్ స్పెషాలిటీ. ఈ డుకాన్ డైట్ ప్రపంచంలోనే అత్యధిక మంది అనుసరించే ఆహార పద్ధతుల్లో తొమ్మిదో స్థానంలో ఉంది. డుకాన్ డైట్లో భాగంగా ప్రోటీన్‌తో కూడిన ఆహారాన్ని అధికంగా తినడం మాత్రమే కాదు, పిండి పదార్థాలు, కొవ్వులు ఉండే ఆహారం తగ్గించి తినాలి. అప్పుడు బరువు తగ్గడమే కాదు. అందం, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఈ డైట్లో భాగంగా తినే ఆహారంలో సహజసిద్ధమైన ఆహారాలే అధికంగా ఉంటాయి.
క్యాలరీలను బర్న్ చేయడం, శరీరానికి బలాన్ని, శక్తిని ఇవ్వడం దీని ప్రత్యేకత. అలాగే శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుందట.. ఈ డైట్‌ను 1970లో ఫ్రెంచ్ పోషకాహార నిపుణుడు పియరి డుకాన్ రూపొందించాడు. లీన్ ప్రోటీన్ తినడం, ఎక్కువ నీరు తాగడం, అరగంట పాటు నడవడం డుకాన్ డైట్లో భాగాలు. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగానే తీసుకుంటారు. దీని వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఈ డైట్‌లో భాగంగా ఓట్స్, బీన్స్, వంకాయ, ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, పాలకూర వంటి పిండి లేని పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారట. చేపలు, మాంసం, గుడ్లు వంటి ప్రోటీన్ ఆహారాలను మితంగా తీసుకుంటారట.. అధికంగా నీళ్లు తాగుతారు. 30 నిమిషాలు పాటు వ్యాయామం ఉంటుంది. పండ్లు అధికంగా తింటారు. దీని వల్ల బరువు ఆటోమేటిక్‌గా తగ్గుతారు. నెల రోజులు ఈ డైట్ పాటిస్తే.. మంచి రిజల్ట్‌ ఉంటుందట.. ఇంట్రస్ట్‌ ఉంటే మీరు పాటించండి..

Read more RELATED
Recommended to you

Latest news