ఇండోనేషియా దీవుల్లో పోర్న్ విల్లా.. సెర్చింగ్ లో పోలీసులు..

ఇండోనేషియా పోలీసులు పోర్న్ విల్లాని పట్టుకునే పనిలో ఉన్నారు. దీవుల సముదాయమైన ఇండోనేషియాలోని బాలి దీవిలో పోర్న్ విల్లాలో పోర్న్ సినిమాలు చేస్తున్నట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. మహమ్మారి సమయంలో ఈ నీలిచిత్రాల షూటింగ్ జరిగినట్లు చెబుతున్నారు. ఇండోనేషియా చట్టం ప్రకారం నీలిచిత్రాల చిత్రీకరణ చట్ట విరుద్ధమైనది. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే భారీ జరిమానాలతో పాటు శిక్షలుకూడా విధిస్తారు.

బాలి దీవికి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో పర్యాటకులు వస్తుంటారు. తాజాగా రష్యన్ పోర్న్ నటి వెరోనికా త్రోషికా తన బాయ్ ఫ్రెండ్ తో బాలి దీవిలో పోర్న్ వీడియోలు చిత్రీకరించింది. ఈ సంఘటనతోనే ఇండోనేషియాలోని పోర్న్ విల్లా వెలుగులోకి వచ్చింది. బాలి దీవులకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. 2020లో మహమ్మారి సమయంలో చాలా మంది పర్యాటకులు బాలి చేరుకున్నారు.

పోర్న్ విల్లా సమాచారం బయటకి ఎలా వచ్చిందంటే:

అత్యంత రహస్యమైన పోర్న్ విల్లా గురించి టిక్ టాక్ వీడియో ద్వారా బయటపడింది. ఆ వీడియోలో చాలామంది అమ్మాయిలు అర్థనగ్నంగా కనిపించారు. వాళ్ళందరూ ఇతర దేశస్తులుగా ఉన్నారు. అందులో ఒకే ఒక్కరు మాత్రం ఇండోనేషియాకి చెందినవారిగా గుర్తించారు. ఈ వీడియో ఇండోనేషియా మీడియాలో చక్కర్లు కొట్టింది. అప్పుడే పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోలో చూపిన దాని ప్రకారం పోర్న్ విల్లాని కనిపెట్టడానికి బయల్దేరారు. కానీ ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం గమనార్హం.

దీంతో ఇండోనేషియా పోలీసులు ఆ దేశంలోని హోటళ్ళు, రెస్టారెంట్లకు ప్రకటన విడుదల చేసారు. తమ హోటల్ గదులని అద్దెకి ఇచ్చే ముందు ఓ కంట కనిపెట్టాలని, చట్ట వ్యతిరేక పనులైన పోర్న్ చిత్రాల చిత్రీకరణ జరగకుండా చూసుకోవాలని చెప్పింది.