హ్యాండ్ శానిటైజర్: ఎంత తరచుగా ఎంత మొత్తంలో వాడాలో చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..

-

ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ నుండి దూరంగా ఉండడానికి శానిటైజర్ ని మించిన ఆయుధం లేదు. కేసులు ఎక్కువ అవుతున్న సమయంలో చేతుల పరిశుభ్రత చాలా అవసరం. ఐతే రోజులో ఎంత తరచుగా, ఎంత మొత్తంలో వాడాలనేది తెలుసుకోండి. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు చేసింది. అవేంటో చూద్దాం.

ముఖ్యంగా ఆల్కహాల్ కలిగి ఉన్న హ్యాండ్ శానిటైజర్ ని వాడేటపుడు ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాల్సిందే.

ఎంత మొత్తంలో హ్యాండ్ శానిటైజర్ వాడాలంటే,

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రకారం చేతికి అరచేతి నిండా శానిటైజర్ తీసుకుని వేళ్ళకి, మణికట్టు భాగాలకి వర్తించాలి. ఈ ప్రక్రియ చేతులు పొడిబారేదాకా కనీసం 20-30సెకన్లు ఉండాలి.

ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ వాడకం మంచిదేనా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్స్ట్రాగ్రామ్ పేజిలో చెప్పిన ప్రకారం ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఎలాంటి ఆరోగ్య సమస్యలకి కారణం కాదు. చేతులకి మర్దన చేసిన శానిటైజర్ లో చాలా తక్కువ శాతం మాత్రమే చర్మంలోకి వెళ్తుంది. చాలా వస్తువులు ఆల్కహాల్ కంటే ఎక్కువ శాతం చర్మాని మృదువుగా చేసే మూలకాలని కలిగి ఉంటున్నాయి.

ఎంత తరచుగా హ్యాండ్ శానిటైజర్ ని ఉపయోగించాలి?

చాలా తరచుగా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ని వాడవచ్చని తెలిపింది. అనేక ఇతర సూక్ష్మక్రిములు మొదలగు హానికలిగించే క్రిములని ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ చంపేస్తుంది.

శానిటైజర్ బాటిల్ ని ముట్టుకుంటే వైరస్ సోకుతుందా?

శానిటైజర్ బాటిల్ ని ముట్టుకోవడం వల్ల కరోనా సోకే ప్రమాదం పెద్దగా లేదని తెలిపింది. అదీగాక పబ్లిక్ ప్రాంతాల్లో ఎక్కువ మంది శానిటైజర్ ని ఉపయోగిస్తే వైరస్ సోకే రిస్క్ మరింతగా తగ్గుతుంది.

చేతులని శుభ్రపర్చుకోవడం కంటే గ్లవ్స్ ధరించడం మంచి పద్దతా?

గ్లవ్ ధరించడం వల్ల వైరస్ ఒక దగ్గర్కి మరో చోటికి సోకే అవకాశం చాలా ఎక్కువ. మీరెప్పుడు గ్లవ్ ధరించినా వాటిని తీసేసాక, మీ చేతులని శుభ్రపర్చుకోవడం మర్చిపోవద్దు. ఇంకా గ్లవ్ ధరించడం కంటే చేతులని తరచుగా శుభ్రపర్చుకోవడమే బెటర్. వైద్య విభాగంలో కొన్ని ప్రత్యేక పనులకి మాత్రమే గ్లవ్స్ ధరిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news