ఓసారి 2012 సంవత్సరంలోకి వెళ్దాం. 2012 మే నెలలో ముంబైలో లీటరు పెట్రోల్ ధర 78.57 రూపాయలు ఉంది. అంతేనా 2013 సెప్టెంబర్ లో ఏకంగా 83.62 రూపాయలను ఎగబాకింది.
వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అదేనండి.. ఎవరు ప్రధాని అవుతారు? అంటే సర్వేలు ఏదేదో చెబుతాయి కానీ.. సర్వేల గురించి తెలిసిందే కదా. కానీ… వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానికి సమాధానం పెట్రోలు ధరలు చెబుతాయి. పెట్రోల్ బంక్ మీకు సమాధానం చెబుతుంది. నమ్మరా? నిజమండి బాబు.. సరే.. అయితే ఓసారి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లొద్దాం పదండి..
2014 ఎన్నికల్లో ఏం జరిగింది.. యూపీఏ ఓడిపోయింది. బీజేపీ గెలిచింది. అయితే.. 2014 ఎన్నికల సమయంలో యూపీఏ ఎటువంటి పరిస్థితులనైతే ఎదుర్కొన్నదో.. ప్రస్తుతం బీజేపీ కూడా అదే పరిస్థితిలో ఉంది. అర్థం కాలేదా? యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు.. తన పాలనలో చివరి రెండేళ్ల కాలంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఎన్డీఏ హయాంలోనూ అదే పరిస్థితి ఉన్నది కదా. ఇప్పుడు కూడా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ ధరలపై దేశ ప్రజలు గుర్రుగా ఉన్నారు.
సరే.. ఓసారి 2012 సంవత్సరంలోకి వెళ్దాం. 2012 మే నెలలో ముంబైలో లీటరు పెట్రోల్ ధర 78.57 రూపాయలు ఉంది. అంతేనా 2013 సెప్టెంబర్ లో ఏకంగా 83.62 రూపాయలను ఎగబాకింది. అవి యూపీఏ పతనానికి కారణమయ్యాయని అప్పడు అంతా చర్చించుకున్నారు.
సరే.. ఇప్పుడు ఎన్టీఏ ప్రభుత్వం దగ్గరికి వద్దాం. 2017 అక్టోబర్ లో ముంబై లో పెట్రోల్ ధర లీటర్ కు 79.99 కు చేరింది. 2018 అక్టోబర్ లో 91.34 కు చేరింది. ప్రస్తుతం 78 రూపాయల వద్ద ఆగింది. కొంచెం అటూ ఇటూ హెచ్చుతగ్గులు ఉన్నా.. పెట్రోల్ ధర పెంపు అనేది ఎన్టీఏ ప్రభుత్వానికి కూడా చెంపపెట్టేనంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
యూపీఏ హయాంలో పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగాయి..
అంటే.. దానికి ఓ కారణం ఉంది. గ్లోబల్ మార్కెట్ లో ముడిచమురు ధర విపరీతంగా పెరిగింది. బ్యారెల్ కు 107.97 డాలర్లకు చేరుకుంది. అంతేనా.. పెట్రోల్ పై వేసే ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు 10 రూపాయలు, డీజిల్ పై 11 రూపాయలుగా ఉండేది. అందువల్ల పెట్రోల్ ధరలు పెరగక తప్పలేదు.
ఎన్టీఏ ప్రభుత్వ హయాలో ఎందుకు పెరిగాయి ధరలు..
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు అప్పుడున్నంతగా లేవు. తగ్గాయి. కానీ.. పెట్రోల్, డీజిల్ ధరలపై అధిక ఎక్సైజ్ డ్యూటీలను వసూలు చేయడం వల్ల పెట్రోల్ ధరలు పెరిగాయి. ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి 2016 వరకు పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్పైజ్ డ్యూటీని 9 సార్లు పెంచింది. తర్వాత 2017, 2018 సమయంలో రెండు సార్లు మాత్రమే సుంకాన్ని తగ్గించింది. దీంతో పెట్రో ధరలు కాస్త ఎగబాకాయి.
అప్పుడు పెరిగిన పెట్రోలు ధరలు యూపీఏను దెబ్బతీస్తే.. ఇప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలు ఎన్టీఏను దెబ్బ తీస్తాయా? అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.