జిగురు బాటిల్‌ లోపల ఎందుకు అంటుకోదు.. దీనికి కారణం ఏంటో..?

-

మనం ఏదైనా అంటించాలంటే.. గ్లూ తీసుకుంటాం. అందులో ఉన్న జిగురుతో ఏదైనా సింపుల్ గా అతికించేయొచ్చు. మరి అది ఉండే బాటీల్లో ఎందుకు అంటుకోదు.. అసలు ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా.? వచ్చే ఉంటుంది కదా. సాధరణంగా.. చిన్నప్పుడు ప్రతీదానికి మనకు డౌట్లు వస్తాయి. అది అలానే ఎందుకు ఉంది, ఇక్కడ ఎందుకు పెట్టారు, ఇలా ఎందుకు చెయ్యాలి అంటూ.. తిక్క తిక్క ప్రశ్నలతో మనం పెద్దోళ్లను విసిగించే ఉంటాం. కానీ ఈ జనరేషన్ పిల్లలకు ఏమైనా డౌట్స్ వస్తే.. సీదా గూగుల్ లో పోయి అడిగేస్తున్నారు అనుకోండి. సరే ఈరోజు మనం జిగురు బాటిల్ కు ఎందుకు అంటుకోదో చూద్దాం.

తెల్లటి జిగురు వివిధ రకాల రసాయనాల నుండి తయారవుతుంది. ఈ రసాయనాలను పాలిమర్‌లు అంటారు. ఈ పాలిమర్లుకు అంటుకునే గుణం ఉంటుంది. ఉత్తమమైన జిగురును రూపొందించడానికి జిగురు తయారీదారులు అటువంటి స్టిక్కీ స్టాండ్‌ల ఉపయోగిస్తారు. అయితే తెలుపు రంగులో వచ్చే జిగురులో నీరు కూడా ఉంటుంది. ఈ నీరు ఒక విధంగా ద్రావకంలానే పనిచేస్తుంది. నీటి కారణంగానే ఈ జిగురు అంటుకునే వరకు ద్రవ రూపంలో ఉంటుంది. మీరు కాగితంపై ఎప్పుడైతే.. జిగురును వేస్తారో.. దాని ద్రావకం (నీరు) గాలిలోకి ఆవిరైపోతుంది. నీరు ఆవిరైనప్పుడు ఈ జిగురు ఎండిపోయి గట్టిపడుతుంది. ఇప్పుడు జిగురులో స్టిక్కీ, ఫ్లెక్సిబుల్ పాలిమర్‌లు మాత్రమే మిగులుతాయి. శా దీన్నే.. మెకానికల్ అడెషన్ అని కూడా అంటారు.

ఈ జిగురు సీసా/ప్యాక్‌లో ఉన్నప్పుడు అందులో తగినంత గాలి లేనప్పుడు జిగురులో ఉన్న నీరు ఆరిపోయి ఆవిరిగా మారుతుంది. ఈ ప్యాకింగ్ సహాయంతో జిగురులో ఉన్న నీరు ఎండిపోకుండా కాపాడుతుంది.. అందుకే మనం.. బాటిల్ ను వెంటనే కాప్ పెట్టేస్తాం. ఎప్పుడైతే.. గ్లూ బాటిల్ క్యాప్ పెట్టకుండా.. కొంత సమయం అలానే ఉంచుతామో..అది ఎండిపోతుంది. ఇలా కూడా మనకు ఎప్పుడో ఓసారి జరిగే ఉంటుంది.

సో గ్లూ బాటిల్లో ఉండే నీరు కారణంగా.. అది బాటిల్ కు అంటుకోదనమాట. ! మీ డౌట్ కు క్లారిఫికేషన్ వచ్చిసిందిగా.

Read more RELATED
Recommended to you

Latest news