మార్కెట్ లో Samsung Galaxy A13, A23 స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్స్ పర్ఫెక్ట్..! 

-

స్మార్ట్ ఫోన్ రంగంలో శాంసంగ్ తనదైనశైలిలో దూసెకెళ్తుంది. ఒకదాన్ని మించి ఒకటి రిలీజ్ చేస్తుంది. గెలాక్సి ఏ సిరీస్ తో తాజాగా మరో రెండు ఫోన్లను శాంసంగ్ ఇండియన్ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. Samsung Galaxy A13, Samsung Galaxy A23 మొబైళ్లు విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు 5000ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుక నాలుగు కెమెరాల సెటప్‌తో వస్తున్నాయి. ఈరోజు మనం ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్స్ చూద్దాం.
Samsung Galaxy A13 స్పెసిఫికేషన్లు
Samsung Galaxy A13 మొబైల్‌ 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంది.
ఎగ్జినోస్ 850 (Exynos 850) ప్రాసెసర్‌పై ఈ ఫోన్ నడుస్తుంది.
గరిష్ఠంగా 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. మైక్రో ఎస్‌డీ కార్డు కోసం స్లాట్ ఉంటుంది.
ఇక మొబైల్‌ వెనుక నాలుగు కెమెరాల అమరిక ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మాక్రో, డెప్త్ కెమెరాలు ఉన్నాయి. అలాగే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్‌ ఉంటుంది.
బ్యాటరీ విషయానికి వస్తే.. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ13 మొబైల్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉండగా.. బాక్స్‌లో 15 వాట్ల చార్జర్‌ను ఇస్తోంది
4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.
ధర సంగతి చూస్తే.. Samsung Galaxy A13లో రెండు వేరియంట్లు ఉన్నాయి.. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ13 మొబైల్‌ 4జీబీ ర్యామ్ + 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది.
6జీబీ ర్యామ్ + 128జీబీ టాప్‌ మోడల్ ధరను రూ.17,999గా సామ్‌సంగ్‌ నిర్ణయించింది.
నలుపు, లైట్ బ్లూ, ఆరెంజ్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది.

 Samsung Galaxy A23 హైలెట్స్:

ఈ స్మార్ట్‌ఫోన్‌ కూడా 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో వస్తోంది.
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ ఈ మొబైల్‌లో ఉంది.
గరిష్ఠంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‍ను పొడిగించుకోవచ్చు.
వెనుక నాలుగు కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టు ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యంతో మాక్రో, డెప్త్ సెన్సార్లు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది లభిస్తకుంది. 25వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ లో కూడా రెండు వేరియంట్లు ఉన్నాయి.‌ 6జీబీ ర్యామ్ + 128జీబీ మోడల్ ధర రూ.19,499గా ఉండగా..
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ టాప్‌ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది.
సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మొబైళ్లు లిస్ట్ అయ్యాయి. మీడియమ్ బడ్జెట్ లో మంచి ఫోన్ తీయాలంటే.. ఇవి మంచి ఎంపికే.. బెస్ట్ ఫీచర్స్ తో మన బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news