కూల్ డ్రింక్ బాటిల్ లో డ్రింక్ ని నిండుగా ఎందుకు నింపరు..? డేంజర్ అనేనా..?

-

చాలా మంది కూల్ డ్రింక్స్ ని ఇష్టపడి ఎక్కువగా తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్ ని తాగితే ఏదో రిలీఫ్ ని పొందినట్లు భావిస్తారు. కానీ కూల్ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువ ఉంటుంది. అలానే ఇతర పదార్థాల వలన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తక్కువగా కూల్ డ్రింక్స్ ని తీసుకోవడం మంచిది. అసలు తీసుకోకుండా ఉంటే కూడా మంచిదే. చిన్నపిల్లలకైతే అసలు ఇవ్వకుండా ఉండడమే మంచిది.

పార్టీల్లో వాటిల్లో కూల్ డ్రింక్స్ ని కచ్చితంగా పెడుతూ ఉంటారు. అయితే కూల్ డ్రింక్ బాటిల్ ని మీరు గమనించినట్లయితే కూల్డ్రింక్ బాటిల్ లో ఎప్పుడూ కూడా కొంచెం గ్యాప్ వదిలేసి కూల్డ్రింక్ ని ఫిల్ చేస్తారు. బాటిల్ నిండుగా కూల్ డ్రింక్ ని నింపరు. కొంచెం గ్యాప్ వదిలేసి మాత్రమే కూల్ డ్రింక్ ని బాటిల్లో నింపుతారు. ఏ కంపెనీ కూల్ డ్రింక్ ని చూసిన బాటిల్ మూత వరకు నిండుగా కూల్డ్రింక్ నింపి ఉండదు.

మరి ఎందుకు అలా వెలితి వదిలేస్తారు..? దాని వెనుక కారణం ఏంటి అంటే.. కూల్డ్రింక్ లో
కార్బోనేటేడ్ వాటర్ ని కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ తో మిక్స్ చేస్తారు. గ్యాస్ బాటిల్ లో పెట్టడానికి డ్రింక్ ని తగ్గించి బాటిల్లో వేస్తారు. అలా కాకుండా కార్బన్ డయాక్సైడ్ కోసం ఏ ఖాళీ కూడా లేకుండా నిండుగా డ్రింక్ ని పోస్తే బాటిల్ పేలిపోయే ఛాన్స్ ఉంది. దీంతో అధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలో కాళీ లేకపోతే బాటిల్ పగిలిపోతుంది అందుకనే గ్యాప్ వదిలేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news