గతంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రఘునందన్ రావు ఎలా అయితే యువతను ఆకట్ట్టుకునే ప్రయత్నంగా డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రీగా ఇప్పిస్తానని చెప్పాడో…. ఇప్పుడు అదే రీతిలో BRS ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రీ గా ఇప్పిస్తానంటూ దుబ్బాకలో ప్రపోజల్ తీసుకువచ్చాడు. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ఏ విధంగా ఓటర్ల మనసులను గెలుచుకోవాలి అన్న దానిపై దృష్టిని సారించి ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే అధికార పార్టీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గెలవడానికి కీలకంగా మారనున్న యువతను ఆకట్టుకునే ప్రయతాన్ని మొదలుపెట్టాడు. ఇక ఈ డ్రైవింగ్ లైసెన్స్ ను పొందాలి అనుకున్న యువతకు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దుబ్బాక ఎంపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంపీ ప్రకటించారు.
మరి గతంలో రఘునందన్ లాగానే ఇతను కూడా సక్సెస్ అవుతాడా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల సమయం వరకు ఆగాల్సిందే. కాగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా బీజేపీ నుండి రఘునందన్ రావు ఉన్నాడు.