కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసే విహార యాత్రని ”honeymoon” అని ఎందుకు పిలుస్తారు..? కారణం ఏంటంటే..?

-

Honeymoon: కొత్తగా పెళ్లయిన వాళ్లు ఏదైనా విహారి యాత్రకు వెళుతూ ఉంటారు. అయితే అలా విహార యాత్ర కి వెళ్లడాన్ని హనీమూన్ అని పిలుస్తారు. ఎందుకు హనీమూన్ అని పిలుస్తారు దాని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్ కి వెళ్తారు అక్కడికి వెళ్లి ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు పైగా ఒకరితో ఒకరికి చాలా కొత్తగా ఉంటుంది. అందుకోసం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. హనీమూన్ అంటే తేనె తో చంద్రుని తో సంబంధం లేదు అయినా కూడా హనీమూన్ అని పిలుస్తారు. ఆంగ్ల భాష నుండి హనీమూన్ అనే పదం వచ్చింది. హనీ అనే పదానికి కొత్త వివాహంలోని మాధుర్యం లేకపోతే ఆనందం అనే అర్థం వస్తుంది. అంతేకానీ తేనే కాదు.

honeymoon

కానీ యూరోపియన్ సాంప్రదాయం ప్రకారం చూస్తే తేనే నీటితో చేసిన పానీయాన్ని కొత్తజంటకి ఇస్తారు అందుకని హనీమూన్ కి ఇలా తేనెతో లింక్ ఉంది. చంద్రుని గురించి చూస్తే చంద్రుడు శరీర చక్రాలకి గుర్తు అంటారు వాస్తవానికి చంద్రుని ఆధారంగా సమయాన్ని లెక్కపెడతారు ఇలా చూసుకుంటే హనీమూన్ అంటే ఆనందంగా గడిపే సమయం అని చెప్పొచ్చు.

పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు ఎంజాయ్ చేసే సమయాన్ని హనీ మూన్ అని పిలవడానికి కారణం ఇదే. ఫ్రెంచ్ భాషలో హానీ మూన్ అని అందుకే అంటారు. ఫ్రెంచ్ లో 18వ దశబ్దం నుండి హనీమూన్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతోంది అప్పటినుండి ఇప్పటివరకు ఈ పదాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. పెళ్లయిన తర్వాత కొత్త జంట ఇండియాలో ఉన్న ప్రదేశాలకి కానీ విదేశాలకి కానీ వెళ్లి హనీ మున్ని జరుపుకుంటారు చక్కటి తీయటి క్షణాలను ప్రేమగా భార్యాభర్తలు జ్ఞాపకాలుగా మార్చుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version