బాబోయ్..ఇదేం ప్రేమ రా నాయనా..నవ్వులు పూయిస్తున్న వీడియో..

-

మొగుడు పెల్లాలు అన్నాక సరదాలు,సరసాలు ఉండాలి..అప్పుడే జీవితం సరదాగా ఉంటుంది.. దంపతుల్లో ఎవరో ఒకరు అప్పుడప్పుడు చేసే చిలిపి పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి.కొన్ని సార్లు చిరాకు కలిగిస్తుంటాయి. వీటన్నింటిని కలుపుకుని ముందుకు వెళ్తేనే సంసార జీవితం ఆనందంగా సాగిపోతుంది. లేకుండా గొడవలు తప్పవు. ఇవి కొన్ని సార్లు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం..

అయితే కొన్ని సార్లు అక్కడి పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు నవ్వులు పూయిస్తుంటాయి. భార్యాభర్తల మధ్య జరిగే ఇలాంటి గిల్లి కజ్జాలకు కొదవ లేదు..ఈ మధ్య సోషల్ మీడియా లో ఇలాంటి వీడియోలకు లెక్కలేదు.. విపరీతమైన క్రేజ్ ను అందుకున్నాయి.నెటిజన్లు తమకు వచ్చిన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తమ ట్యాలెంట్ ను బయటపెడుతున్నారు. వీటిలో ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి చేసే వీడియోలు చాలా పాపులర్ అవుతున్నాయి. ఇలాంటి వాటిని చూసేందుకు సోషల్ మీడియా యూజర్లు ఆసక్తి చూపిస్తుంటారు…

తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.ఈ వీడియాలో భర్త భోజనం చేసి చేయి కడుక్కునేందుకు వాష్ బేసిన్ వద్దకు వెళ్తాడు. అదే సమయంలో అక్కడ తన భార్య గిన్నెలను శుభ్రపరుస్తోంది. అతను హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. అయితే చేతులు తుడుచుకోవడానికి అతని వద్ద క్లాత్ లేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అతనికి మెరుపు లాంటి ఆలోచన తట్టింది. తన భార్యను దగ్గరకు తీసుకుని, ప్రేమగా నిమిరాడు. అంతటితో ఆగకుండా ఆమె వేసుకున్న టీ షర్ట్ తో చేతులు తుడుచుకున్నాడు. ఇక అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ విషయం తెలియని భార్య తన భర్త చూపించిన ప్రేమను నిజమనుకుని తెగ మురిసిపోయింది..ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే తెగ వైరల్ అయ్యింది..

Read more RELATED
Recommended to you

Latest news