Variety Love Story : హిజ్రాతో ప్రేమలో భర్త.. ఇద్దరికి పెళ్లి జరిపించిన భార్య

-

తన భర్త వేరే మహిళప వైపు కన్నెత్తి చూస్తేనే భార్య తట్టుకోలేదు. అలాంటిది పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని తెలిస్తే..? పరాయి స్త్రీతో ప్రేమలో పడ్డాడని తెలిస్తే.. ఆమె రియాక్షన్ ఎలా ఉండాలి. భూమి, ఆకాశాన్ని ఒకటి చేసినంత, పచ్చగడ్డిని చూస్తేనే బగ్గుమనేంత ఆగ్రహం కట్టలు తెంచుకువస్తుంది. సాధారణంగా అయితే ఇలాంటిదేదో జరుగుతుంది. కానీ ఒడిశాలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది.

భర్త పరాయి స్త్రీతో కాదు ఓ హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలిసిన భార్య అందరిలా కోపోద్రిక్తురాలు కాలేదు.. భర్తపై ఫిర్యాదు చేయలేదు.. అతణ్ని నిందించనూ లేదు. అతడి ప్రేమను అర్థం చేసుకుంది. వారిద్దరికి పెళ్లి చేసింది. ఈ ఘటన ఒడిశాలోని కలకండి జిల్లా నర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డోర్‌కుట్‌ చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఫకీర్‌ నియాల్‌కు అయిదేళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం ఆయన గ్రామానికి చెందిన సంగీత అనే హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య ఆ హిజ్రాతో మాట్లాడి తన భర్తతో ఆదివారం సంప్రదాయబద్ధంగా గ్రామంలోని ఆలయంలో పెళ్లి చేయించింది. తాను ఫకీరును ప్రేమించానని, ఆయన భార్య కొత్త జీవితం ప్రసాదించిందని, ఇప్పుడు నా కోసం ఒక కుటుంబం ఉందనే ఆనందం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news