దేవుడా.. అరటిపండ్లు తింటే చనిపోతారా?

-

పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది..అందులో అరటిపండు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పేద ప్రజలకు అందుబాటు రేటులో ఉంటుంది.అరటి పండుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోమాలియా నుంచి భారత్‌కు పెద్ద మొత్తంలో అరటి పండ్లు దిగుమతి అయ్యాయి. వాటిని తింటే.. 12 గంటల్లో మనుషులు చనిపోతారనేది ఆ వార్తకు అర్థం..

ఈ అరటి పండ్లలో భయంకరమైన బ్యాక్టీరియా (హెలికోబ్యాక్టర్) ఉంది. చూడటానికి వానపాములా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉన్న అరటి పండ్లను తిన్న వెంటనే వాంతులు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడతాం. ఆ తర్వాత 12గంటల్లోపు బ్రెయిన్ డెడ్ అయి.. మనిషి చనిపోతాడు. ఆ అరటి పండ్లకు సంబంధించిన ఈ కింది వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేయండి’ అని వార్త గతంలో వైరల్ అయ్యింది.ఇక ఇప్పుడు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది..ఈ బ్యాక్టీరియా ఉన్న అరటి పండ్లను తిన్న వెంటనే వాంతులు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడతాం. ఆ తర్వాత 12గంటల్లోపు బ్రెయిన్ డెడ్ అయి, మనిషి చనిపోతాడు. ఆ అరటి పండ్లకు సంబంధించిన ఈ కింది వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేయండి’ అని పేర్కొంటూ ట్విట్టర్‌లో ఓ ట్వీట్ హల్ చల్ చేస్తోంది.

తమిళనాడులోని నేషనల్ బనానా రీసెర్చ్ సెంటర్ హెలికోబ్యాక్టర్ గరించి కీలక వ్యాఖ్యలు చేసింది. పాడైన అరటి పండ్లలో హెలికోబ్యాక్టర్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని తెలిపింది. అలాగే వీడియోలో చూపినట్టుగా బ్యాక్టిరియా పరిమాణం.. వానపాములా అంత పెద్దగా ఉండదని వెల్లడించింది. బ్యాక్టీరియాలను కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలమని స్పష్టం చేసింది. మరోక ముఖ్య విషయం ఏంటంటే.. సోమాలియా నుంచి భారత్ అరటి పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్టు ఎటువంటి సమాచారం లేదు.. మొత్తానికి ఇది ఫేక్ అని తేలింది..ఇలాంటి వాటిని నమ్మొద్దని అధికారులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news