రెజ్లింగ్ పోటీలో మహిళ…అసలు రెజ్లింగ్ ఎవరితో తెలిస్తే షాక్ అవుతారు!

-

రెజ్లింగ్ లో మహిళలు పోటీ పడడం ఈ రోజుల్లో కామన్ అనే చెప్పాలి. దానిలో ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది అని అనుకుంటున్నారేమో. కానీ ఈ మహిళ మాత్రం పాల్గొన్న రెజ్లింగ్ కు ఒక ప్రాధాన్యత ఉంది. ఇంతకీ ఆ ప్రాధాన్యత ఏంటి అని అనుకుంటున్నారా. ఎదో ఒక ఆడ,మగ మనిషి తో రెజ్లింగ్ చేస్తే అది వేరు,కానీ ఈ మహిళ మాత్రం ఒక ఎలిగేటర్ తో రెజ్లింగ్ పోటీలో పాల్గొంది. ఫ్లోరిడా లోని బ్రైటన్ లో జరిగిన ఫ్రీస్టైల్ ఎలిగేటర్ రెజ్లింగ్ పోటీలో ఆష్లే లారెన్స్ అనే మహిళ మైదానంలో అడుగుపెట్టింది. ఏడుగుగా మొసలి,చుట్టూరా జనం గుమిగూడి ఉన్నారు. మొసలి ని చూసిన ఆమె దానికి చేరువగా వెళ్లి గోరుముద్దలు తినిపించడానికి అన్నట్లుగా మొసలి నోరును తెరిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ మొసలి అందుకు సహకరించకపోవడం తో అదిమిపట్టుకొని దాని నోరును తెరిపించింది. అప్పటికే ఆ మహిళ తెగువుకు అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా ఆమె మరో భయానకమైన చర్యకు పాల్పడింది. ఆ మొసలి నోరు ను బలవంతంగా తెరిచిన ఆ మహిళ వెంటనే నేరుగా ఆమె తలను మొసలి నోట్లోకి పోనిచ్చింది. ఇక అంతే అక్కడ గుమిగూడిన జనాలకి ఒక్కసారిగా గుండె ఆగినట్లు అయ్యింది.

అసలుకే క్రూర జంతువు అందులోనూ బలవంతంగా దాని నోరు తెరిపించి ఇప్పుడు ఇలా దాని నోట్లో తలపెట్టడం తో ఆ క్షణాన ఆ ఘటనను చూసిన వారికి క్షణంపాటు గుండె కొట్టుకోవడం ఆపేసినట్లనిపిస్తుంది. కానీ అదృష్టవశాత్తూ కొన్ని సెకన్ల తర్వాత ఎలాంటి ప్రమాదం బారిన పడకుండానే ఆ మహిళ ఆ మొసలి నోట్లో నుంచి సురక్షితంగా బయటపడింది. అయినా ఒక మహిళ ఈ సాహసం పాల్పడడం తో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిజంగా ఆ మహిళ తెగువుకు అందరూ హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news