ప్రపంచ పర్యావరణ దినోత్సవం: కాలుష్య రహిత జీవితాన్ని గడిపేందుకు ఐదు విషయాల్లో మార్పులు..

-

ప్రతీ సంవత్సరం జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day)గా జరుపుకుంటున్నారు. ఈ పర్యావరణ దినోత్సవం రోజున మీ జీవితంలో ఏదైనా మార్పులు చేసుకోవాలని భావిస్తున్నారా? ప్రకృతితో మమేకమై జీవితాన్ని మరింత ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారా? ఐతే మనం ప్రతి రోజు వాడే వస్తువుల్లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం | World Environment Day

కంపోస్ట్ టేబుల్

ప్లాస్టిక్ టేబుల్స్ ని వాడే ప్రతీ ఒక్కరు దీని గురించి తెలుసుకోవాల్సిందే. భూమిలో శిథిలం కాని ప్లాస్టిక్ కారణంగా వాతావరణం కలుషితం అవుతుంది. అందువల్ల కంపోస్ట్ టేబుల్ వాడడం ఉత్తమం. ఇది చెరుకు పిప్పి నుండి తయారవుతుంది. కాబట్టి, కాలుష్యరహితంగా ఉంటుంది.

వెదురు టూత్ బ్రష్

పెద్దమార్పు ఒకేసారి రాదు. అందుకే చిన్నగా మొదలవ్వాలి. కాబట్టి రోజూ వాడే ప్లాస్టిక్ టూత్ బ్రష్ ని మార్చండి. ప్లాస్టిక్ స్థానంలో వెదురు టూత్ బ్రష్ వాడడం మొదలెట్టండి. ప్రస్తుతం చార్ కోల్ టూ బ్రష్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

కంపోస్ట్ చెత్త బ్యాగులు

చెత్తను పారవేయడానికి ప్లాస్టిక్ బ్యాగ్స్ కి బదులుగా మొక్కజొన్నతో తయారయ్యే చెత్త బ్యాగులను వాడండి. ఇవి పర్యావరణ హితంగా ఉంటాయి. భూమిలో తొందరగా కరిగిపోతాయి. పొద్దున్న లేవగానే ఎన్ని చెత్త బ్యాగులు చెత్తకుప్పల్లోఖి చేరతాయో తెలిసిందే. ఇదొక్కటి మారిస్తే ప్రపంచం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రకృతి కలుషితం కాకుండా ఉంటుంది.

పేపర్ స్ట్రా

అసలు స్ట్రా కారణంగా భూమి కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దీనికి బదులుగా పేపర్ స్ట్రా, స్టీల్ స్ట్రా అందుబాటులో ఉన్నాయి. జ్యూస్ సెంటర్ కి వెళ్ళినపుడు వీటిని అడగండి. మీరు అడిగితేనే ఇంకోసారి వచ్చినపుడైనా వినియోగదారులకి అందించే అవకాశం ఉంటుంది.

శానిటరీ ప్యాడ్స్

శానిటరీ ప్యాడ్స్ ప్లాస్టిక్ ఆధారంగా తయారవుతున్నాయి. ఇవి ప్రకృతికి మంచివి కాదు. ఐతే వీటిని ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, వెదురుతో తయారయ్యే శానిటర్ ప్యాడ్స్ అందుబాటులోకి వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news