మీ పిల్లలు ఫోన్ల ముందు గంటల తరబడి ఉంటున్నారా..? నిజానికి స్క్రీన్ల ముందు ఎంతసేపు వుండచ్చంటే..?

-

ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్, టీవీ, కంప్యూటర్లు అలవాటై పోతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటినుండి కూడా పిల్లలు ఎక్కువగా వీటితోనే గడుపుతున్నారు. అయితే ఎక్కువ సేపు స్క్రీన్ల ముందు గడపడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు పిల్లల్ని వాటి నుంచి దూరంగా ఉంచడం మంచిది. చాలా రిపోర్టులు పిల్లలు మరియు పెద్దలు కూడా స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలని చెప్పాయి.

ముఖ్యంగా పిల్లలు లాప్టాప్లు, టీవీ, ఫోన్ వంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. ఎక్కువ కాలం పాటు స్క్రీన్ ముందు గడపడం వల్ల పిల్లల్లో మార్పులు వస్తున్నాయి. పిల్లల యొక్క ప్రవర్తనని కూడా అది ఎఫెక్ట్ చేస్తోంది. ఫోన్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల పిల్లలకి నిద్రలేమి సమస్య వస్తోంది. నిద్రలేమి సమస్య రావడం వల్ల ఒబేసిటీ కూడా వస్తుంది. అలానే పిల్లల యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటున్నాయి. స్క్రీన్ల ముందు సమయం ఎక్కువ గడపడం వల్ల ఇరిటబిలిటీ సమస్య వస్తుంది.

అలాగే పిల్లల్లో మాటలు ఆలస్యంగా రావడానికి కూడా కారణం అవుతుంది. అలానే హైపర్ యాక్టివిటీ, ఆటిజం వంటి సమస్యలు కూడా వచ్చే రిస్కు ఉంది అయితే తల్లిదండ్రులు పిల్లల్ని స్క్రీన్ల ముందు రెండు గంటల కంటే ఎక్కువ సేపు ఉంచకూడదు అని నిపుణులు అంటున్నారు. అదే రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అయితే రోజుకి గంట కంటే ఎక్కువ సేపు ఉండకూడదు. రెండు నుండి ఐదు ఏళ్ల పిల్లలు అయితే గంట వరకు ఉండొచ్చు. ఆరేళ్లు అంతకంటే పైబడిన వాళ్లు రెండు గంటల కంటే ఎక్కువ సేపు ఉండకూడదు. ఇలా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటే పిల్లల్లో సమస్యలు రావు లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news