ఇవాళ మే 30న మధ్యాహ్నం 12.23 గంటలకు ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవాడలో జరగనుంది. ఈనేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారాన్ని చూడటానికి ఆయన కూతురు వర్షారెడ్డి లండన్ నుంచి హైదరాబాద్ కు వచ్చింది.
నాకు డబ్బులు కాదు కావాల్సింది… ప్రజల ప్రేమ. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం.. అంటూ ఏపీ మొత్తం తిరిగి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. ప్రజల కష్టాలను దగ్గర్నుంచి చూసిన వైఎస్ జగన్… ఎట్టకేలకు తన కోరిక నెరవేర్చుకున్నారు. ముఖ్యమంత్రి కావాలన్న తన కల సాకారం అయింది.
ఇవాళ మే 30న మధ్యాహ్నం 12.23 గంటలకు ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవాడలో జరగనుంది. ఈనేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారాన్ని చూడటానికి ఆయన కూతురు వర్షారెడ్డి లండన్ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. వర్షారెడ్డి.. లండన్ లో చదువుతోంది. తన తండ్రి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారన్న వార్త తెలియగానే ఆమె లండన్ నుంచి హైదరాబాద్ కు వచ్చేసింది.
తర్వాత హైదరాబాద్ నుంచి తన తల్లి, మేనత్త, సోదరి హర్షారెడ్డితో కలిసి గుంటూరులోని తాడేపల్లిలో ఉన్న జగన్ కొత్త నివాసానికి వెళ్లింది. తన తండ్రికి అభినందనలు తెలిపింది. తన తండ్రి ప్రమాణ స్వీకారాన్ని దగ్గరుండి చూడనుంది.
జగన్, భారతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు వర్షారెడ్డి. ఆమె ప్రస్తుతం లండన్ లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతోంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని రోజులు తన కూతురు దగ్గరికి వెళ్లి వచ్చారు జగన్. ఎన్నికల ఫలితాలు వెలువడి.. తన తండ్రి గెలిచారని తెలియగానే.. ఆమె వెంటనే లండన్ నుంచి హైదరాబాద్ కు వచ్చేసింది.
జగన్.. తన ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ప్రముఖులను పిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి.. లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.