ఖాతాలో మే 31 లోగా రూ.12 బ్యాలెన్స్ ఉంచుకోండి.. లేకుంటే 2 లక్షల ఇన్సురెన్స్ కోల్పోతారు..!

-

మీకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలు తెలుసా? అవి.. సగటు భారతీయుడికి తక్కువ ప్రీమియంతో ఇన్సురెన్స్ అందించే పథకాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అవి. వాటినే పీఎమ్ఎస్బీవై, పీఎమ్జేజేబీవై పథకాలుగా పిలుస్తారు.

జాబ్ చేసేవాళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. శాలరీ వచ్చిన రెండు రోజుల్లోనే వాళ్ల ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇక నెల చివరి వరకు అంటే జీరో బ్యాలెన్సే. అయితే.. ఇది వరకు జీరో బ్యాలెన్స్ ఉన్నా పర్లేదు కానీ.. ఈనెల 31 లోగా అంటే రేపటి లోగా మీ బ్యాంక్ ఖాతాలో కనీసం 12 రూపాయలు ఉండేలాగ చూసుకోండి. 12 రూపాయల గురించి ఆలోచిస్తే.. 2 లక్షల రూపాయల ఇన్సురెన్స్ ను మిస్ అయిపోతారు.

మీకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలు తెలుసా? అవి.. సగటు భారతీయుడికి తక్కువ ప్రీమియంతో ఇన్సురెన్స్ అందించే పథకాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అవి. వాటినే పీఎమ్ఎస్బీవై, పీఎమ్జేజేబీవై పథకాలుగా పిలుస్తారు.

ఈ రెండు స్కీముల కింద రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది. పీఎమ్ఎస్బీవై పథకం కింద రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా పొందాలంటే చెల్లించాల్సిన ప్రీమియం కేవలం 12 రూపాయలు. ఈ పాలసీ చేసిన తర్వాత ప్రమాదవశాత్తు పాలసీదారు చనిపోతే 2 లక్షలు, అంగవైకల్యం వస్తే లక్ష రూపాయలు క్లెయిమ్ చేసుకోవచ్చు.

పీఎమ్జేజేబీవై జీవిత బీమా పాలసీ కింద సంవత్సరానికి 330 చెల్లిస్తే చాలు. ప్రమాదవశాత్తు పాలసీదారు చనిపోతే 2 లక్షలు ఇస్తారు. 55 ఏళ్ల వరకు పాలసీ వర్తిస్తుంది.

వీటికి సంబంధించి డబ్బుల ఆటోమెటిక్ గా బ్యాంకుల నుంచి కట్ అవుతాయి. ఆయా బ్యాంకులు కూడా కస్టమర్లకు అలర్ట్స్ పంపించాయి. మే 31 లోగా పీఎమ్ఎస్బీవై పథకం కింద 12 రూపాయలు కట్ అవుతాయి. 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులు. దీని పీరియడ్ జూన్ 1 నుంచి వచ్చే సంవత్సరం మే 31 వరకు ఉంటుంది. ముందుగా అకౌంట్ హోల్డర్ పర్మిషన్ తీసుకున్నాకే బ్యాంకులు 12 రూపాయలను కట్ చేస్తాయి. కాకపోతే మే 31లోగా మీ ఖాతాలో 12 రూపాయల కనీస బ్యాలెన్స్ ఉండాలి. లేకపోతే అద్భుతమైన ఇన్సురెన్స్ ను కోల్పోతారు.

Read more RELATED
Recommended to you

Latest news