ప్రగ్నెంట్ అవ్వాలంటే ఎన్నిసార్లు శారీరకంగా కలవాలో తెలుసా?

మహిళలకు అమ్మతనం చాలా అవసరం..ఆ తియ్యని అనుభూతి ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు..గర్భధారణ సమసయంలో మహిళ శరీరం మరో ప్రాణికి సరైన స్థలాన్ని పొట్టలో ఏర్పాటు చేస్తుంది. బేబీ పెరిగే కొద్ది, నెలలు నిండే కొద్ది పుట్టబోయే బిడ్డకు తగిన పోషకాలు అవసరం అవుతాయి. ఇవి పొట్టలో ఉన్న బేబీకి రక్షణ కల్పిస్తాయి అదేవిధంగా హెల్దీ గ్రోత్‌ను ప్రోత్సహిస్తాయి. గర్భధారణ, ప్రసవం అనేవి ఒక మహిళ జీవితంలో చాలా ముఖ్యమైనవి.

ప్రతి వారం రెండు నుంచి మూడు సార్లు శృంగారం చేయడం ప్రారంభించాలి. మీ అండోత్సర్గము సమయంలో ప్రతి రోజూ అసురక్షితమైన లైంగిక సంబంధంలో పాల్గొనటం మంచిది. దీంతో త్వరగా మీరు గర్భం దాల్చొచ్చు. గర్భవతి కావడానికి ఎంత తరచుగా శృంగారం చేయాలి అనే ప్రశ్నను వైద్యుడిని అడగడం మంచిదే. ఎందుకంటే మీరు మీ క్యాలెండర్‌లో గుర్తుంచుకోడానికి ఇది సహాయపడుతుంది. గర్భం దాల్చాలని అనుకున్నవారు ఆరోగ్యకరంగా ఉండాలి అప్పుడే ఆరోగ్యకరమైన శిశువుకి జన్మనివ్వగలరు..బేబీ ఎదుగుదలకు అన్నీ రకాల పోషకాలు అవసరం..దాంతో పాటు కొన్ని రకాల టెస్టులను కూడా చేయించుకొవాలని నిపుణులు అంటున్నారు..అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రూబెల్లా: ఈ టెస్టును మహిళ శరీరంలో ఏ మేరకు యాంటీ బాడీస్ ఉన్నాయో తెలుసుకునేందుకు వైద్యులు నిర్వహిస్తారు. రూబెల్లా టెస్టులో పాజిటివ్ వస్తే మహిళ శరీరంలో యాంటీబాడీస్ ఉన్నాయని నిర్ధారణ అయినట్లు సూచిస్తుంది..

చికెన్ పాక్స్: ఈ టెస్టు ద్వారా మహిళ శరీరంలో రెడ్ రాష్ లాంటివి ఏవైనా ఉన్నాయా అని వైద్యులు తెలుసుకుంటారు. ఎందుకంటే చికెన్ పాక్స్ ఉంటే ఈ సమస్య పుట్టబోయే బిడ్డకు కూడా సంక్రమించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల చికెన్ పాక్స్ ఉందని తేలితే ప్రెగ్నెంట్ అవ్వడం మంచిది కాదు..

హెచ్‌ఐవీ: హ్యూమన్ ఇమ్యునో వైరస్ అని పిలవబడే హెచ్‌ఐవీ అనేది శరీరంలోని రోగనిరోధక శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వైరస్ రక్తంలోకి ప్రవేశించిందని తేలితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడు. అందువల్ల గర్భం దాల్చాలని కోరుకునే మహిళలు ఈ టెస్టును తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు..

హెర్సస్: శృంగారం ద్వారా శరీరంలోకి సంక్రమించే వ్యాధి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భం దాల్చే ముందు ఈ టెస్టు చేయించుకోవడం ఉత్తమం..

హెపటైటిస్ బి: హెపటైటిస్ బి అనేది రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్-బి అనేది ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళ నుంచి మనకి సోకుతుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే రక్తం, సిమెం, వెజినల్ స్రావాలు నుండి హెపటైటిస్ బి వైరస్ వస్తుంది. ఎవరైతే ఈ హెపటైటిస్-బి కి గురవుతారో వాళ్ల నుంచి శృంగారం లేదా రేజర్‌ని తీసుకోవడం చేస్తే ఇటువంటివి వ్యాపిస్తాయి. అందువల్ల హెపటైటిస్ బి వైరస్ టెస్టు చేయించుకుంటే పుట్టబోయే మంచి ఆరోగ్యంగా ఉంటారు..

థైరాయిడ్ టెస్ట్: ఈ మధ్య చిన్న వయస్సులోనే అన్ని రకాల రోగాలు వస్తాయి..ముఖ్యంగా బీపీ, డయాబెటిస్‌లకు మందులు వేసుకునే వాళ్లు ఎంతమంది ఉన్నారో 20ల వయసులోనే థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవాళ్లు కూడా అంతగానే ఉన్నారు. ఈ సమస్య మగవాళ్లలో కంటే ఆడవాళ్లలోనే అధికంగా ఉంటోంది. ఈ సమస్యతో పిల్లలను కంటే పుట్టబోయే పిల్లల్లో కూడా ఆ లోపం రావొచ్చు. దీంతో వారి మెదడు సరిగ్గా ఎదిగే అవకాశాలు ఉండవు..

తలసేమియా: ఈ టెస్ట్ ను తప్పనిసరిగా చేయించుకోవాలి. మైనర్, ఇంటర్మీడియెట్, మేజర్‌ దశల్లో ఉంటుంది. తలసేమియా అల్ఫా, బీటా రెండు రకాలు. ఒక అల్ఫా చెంజ్‌ కానీ, ఒక బీటా చెంజ్‌ తగ్గినప్పుడు మైనర్‌ వ్యాధి ఉన్నట్లు. వీళ్లు వ్యాధిగ్రస్తులైనప్పటికీ రక్త మార్పిడి అవసరం లేదు. వీరు వ్యాధి తీవ్రతతో బాధపడరు. కానీ వారి నుంచి వారి పిల్లలకు వ్యాధి సంక్రమిస్తుంది. అందువల్ల ప్రెగ్నెంట్ కావాలని భావించే మహిళలు తలసేమియా టెస్ట్ చేయించుకోవడం మర్చిపోవద్దు..