హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..

-

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి , అబిడ్స్ , కోఠి , బషీర్బాగ్ , నారాయణగూడ , గోషామహల్ , అఫ్జల్ గంజ్ , మంగళహట్ , బేగంబజార్ , మలక్ పేట్, సైదాబాద్ , యాకుత్పురా, చార్మినార్, కార్వాన్ లలో భారీగా కురుస్తున్న వర్షం కురుస్తోంది. ప్రజలు బయటికి రావద్దని అత్యవసర ప్రయాణాలు ఉంటే తప్ప బయటకి రావద్దని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి వర్షపు నీరు వచ్చిచేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల విద్యుత్‌ అంతారయం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

No respite from rain in Hyderabad | India News – India TV

అంతేకాకుండా.. రాష్ట్రంలో పలు జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. పది జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్రంలో జలాశయాలు నిండుకుండాల్లా మారాయి. కొన్ని చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా.. ఏపీకి సైతం మరో 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news