ఆడవాళ్ళును ఎక్కువగా మగవారు కేవలం సెక్స్ కోసం మాత్రమే చుస్తారని కేవలం వారి శారీరాన్ని మాత్రమే కోరుకుంటారని చాలా మంది అపోహలో ఉంటారు.అది పూర్తిగా తప్పు అని నిపుణులు అంటున్నారు.ఎందుకంటే మగవారికి ఆడవారిలో శృంగారం కంటే ఎక్కువగా కావాల్సినవి వేరే ఉంటాయి.శారీరక సంతృప్తి కంటే పురుషులకు ఆడవారిలో ఇంకాం ఏం కావాలి.. వాటి వల్ల శృంగారం పురుషులు ఎలా సంతృప్తి పొందుతారో ఇప్పుడు చూద్దాం..
మగవారు శృంగారం కంటే కూడా గౌరవం ఎక్కువ కోరుకుంటారు. ఇతర వ్యక్తులు, ముఖ్యంగా భాగస్వాములు అగౌరవపరిస్తే పురుషులు ఏమాత్రం సహించలేరు. ఇది సంబంధానికి మంచి గౌరవప్రదమైన, సానుకూలత కలిగిస్తుంది. పురుషులకు గౌరవించడం వల్ల వారికి ఎంతో ఆకట్టుకోవచ్చు..
భాగస్వామి తమ పట్ల ఎంత గర్వంగా ఉన్నారో చూపించినప్పుడు పురుషులు ఎక్కువగా ఇష్టపడతారు. ఒకరి బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి వారు తమ పట్ల ఎంత గర్వంగా ఉన్నారో చూపించడం ప్రేమను చూపించడానికి గొప్ప మార్గం. పురుషులు తమ పని లేదా ప్రయత్నాలను గుర్తించినప్పుడు చాలా సంతోషిస్తారు..
ఏ సంబంధంలోనైనా కలహాలు సాధారణం. అయితే వాటి వల్ల ఒకరిపై ఒకరు అరుచుకోవడం సంబంధానికి ఏమంత మంచిది కాదు. ఆడవారు తమపై అరిస్తే పురుషులకు ఏమాత్రం నచ్చకపోగా వారిలో కోపాన్ని పెంచుతుంది..ఆ తర్వాత అది విడి పొయ్యేలా చేస్తుంది.. ఒక్కోసారి విడాకుల వరకూ తీసుకొని వెళ్తుంది..పురుషులు తమ లక్ష్యాల గురించి ఇతర వ్యక్తులతో మాట్లాడటం చాలా అరుదనే చెప్పాలి. తన ఆశలు, కలల గురించి మీకు చెబితే, మిమ్మల్ని వారు ప్రత్యేకంగా చూస్తున్నారనడానికి సంకేతం. మిమ్మల్ని గౌరవిస్తాడని, మీ అభిప్రాయాలకు విలువ ఇస్తాడని అర్థం.. సెక్స్ అనేది కొన్ని సందర్బాల్లొ మాత్రమే పనికివస్తుంది..మనుషుల మధ్య ప్రేమ ఉండాలి అప్పుడే బంధం బలంగా మారుతుంది..