అమ్మాయిల్లోని ఈ విషయాలు అంటే అబ్బాయిలకు చాలా ఇష్టమట..

అమ్మాయిలు అందంగా ఉంటే చాలు అని పురుషులు అనుకుంటారు అంటే అది తప్పే..ఈ రోజుల్లో అబ్బాయిలు స్త్రీల్లోని విభిన్నమైన క్వాలిటీస్ ను చూస్తున్నారు. మగవారితో పాటు సమానంగా ఉండాలని, నాయకత్వం వహించాలని, ఉద్వేగభరితంగా, నమ్మకంగా, మేధావిగా మరియు పూర్తి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు.. అమ్మాయిలు మంచి డ్రెస్ వేసుకోవడం పురుషులకు ఇష్టమట..అందమైన సన్‌డ్రెస్‌ అయినా, హీల్స్‌తో కూడిన సెక్సీ దుస్తులైనా కావచ్చు. సాధారణ దుస్తులు, జుట్టు మరియు అలంకరణతో చక్కగా దుస్తులు ధరించడం మనిషిపై శాశ్వత ముద్ర వేస్తుంది..

ఈ రోజుల్లో సమాజంలో సమానత్వంగా వ్యవహరించే స్త్రీలు అంటే చాలా మంది పురుషులకు ఎక్కడలేని ఇష్టం. సమాన స్థాయిలో అన్నింట్లో వ్యవహరించాలని కోరుకుంటారు. ఈ ఆధునిక సమాజం అంతా సమానత్వానికి సంబంధించినది. బాధ్యతల్లో, బరువుల్లో సమానంగా ఉండాలన్నది చాలా మంది పురుషుల అభిమతం. నాయకత్వాన్ని తీసుకునే ఆడవారు అంటే పురుషులకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ధృడంగా నిలబడటం, ఇనిషియేట్ తీసుకోవడం, లీడర్ గా ఉండే స్త్రీలు తమ జీవితంలో ఉండాలని కోరుకుంటారు.ఏదైనా పెద్ద సమస్యలు ఇచ్చినప్పుడు వెనకడుగు వెయ్యకుండా పోరాడాలని అనుకుంటారు..

తన మాట తీరు పట్ల, తన నడవడిక పట్ల, తన పట్ల తనకు పూర్తి నమ్మకం ఉండటాన్ని పురుషులు బాగా ఇష్టపడతారు. అలాగే ఎప్పుడూ చిరునవ్వులు చిందించే వారంటే మగవారికి చాలా ఇష్టమట.పురుషులు స్త్రీలను నవ్వించడాన్ని ఇష్టపడతారు. స్త్రీ ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి మాత్రమే వారు అనేక విషయాలతో ముందుకు వస్తారు. మీరు దానిని అభినందిస్తే ఖచ్చితంగా అతని హృదయాన్ని కదిలిస్తుంది.ఐ కాంటాక్ట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ ఆత్మవిశ్వాసంతో మాట్లాడే స్త్రీలంటే పురుషులు చాలా ఇష్టపడతారు..ఇంకా బాగా మాటకారి అయితే వారిని అబ్బాయిలు అంత సులువుగా వదులుకోరు..ఇది అండి అబ్బాయిలకు ఇలా ఉంటే చాలా ఇష్టమట..