పెళ్లి తర్వాత శృంగారాన్ని అనుభవిస్తారు.. కానీ కొంతమంది పెళ్లికి ముందు కూడా అనుభవిస్తారు అది వేరే విషయం అనుకోండి.. శారీరక సుఖం ఉంటేనే మానసికంగా బాగుంటారని నిపుణులు అంటున్నారు..వివాహ బంధంలో రొమాన్స్ లేకపోతే అది చిలికిచిలికి గాలివానలా మారుతుంది. ఇద్దరి మధ్య చాలా గొడవలు అవుతుంటాయి. చాలా ఇబ్బందులు వస్తాయి.
నిజానికీ, నేడు చాలా మంది దంపతులు ఇద్దరూ కూడా పనులు చేస్తూ బిజీగానే గడుపుతున్నారు. కాబట్టి, ఇద్దరు ఒకరితో ఒకరు హ్యాపీగా గడపలేరు. ఇద్దరిలో ఒకరు రొమాన్స్ గురించి మాట్లాడినా మరొకరికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే, వీరిద్దరి మధ్య ఆ కార్యం లేకపోతే మాత్రం సమస్యలు తప్పవు…
మ్యారేజ్ అయ్యాక భార్య, భర్తలు ఒకరికొకరు విలువనిస్తారు. ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తారు. అయితే, ఎప్పుడైతే లైంగికంగా దగ్గర కాకపోతే అది గౌరవంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది..భార్యాభర్తల మధ్య ఆ కార్యం లేకపోతే నిజానికీ ఒకరిపై ఒకరికి అదో రకమైన ద్వేషం ఏర్పడుతుంది. అదే విధంగా, వేరే సంబంధాలు పెట్టుకుంటారేమోనన్న భయం కూడా ఉంటుంది. దీంతో, ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉండలేరు.ఆ మాత్రం రొమాన్స్ లేకపోతే ఎన్ని అనర్థాలు వస్తాయో. అంతెందుకండి. మీకేదో గౌరవం, మరేదో దాని కోసమో కాదు. మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉండాలంటే ఆ కార్యాన్ని ఆస్వాదించాల్సిందే.. అందుకే కాస్త టైమ్ కేటాయించి మరి ఎంజయ్ చెయ్యండి.. బంధం బలపడుతుంది..