ఎస్పీ బాలు అరోగంపై స్పందిన తమన్..!

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య ‌ప‌రిస్థితి విషమంగా మారిందని గురువారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు, అభిమానులు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.

ఈ సందేశంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం భగవంతుడిని ప్రార్థించాలని, ఈ సమయంలో అందరి ప్రార్థనలు ఆయనకు అవసరమని, బాలు త్వరగా కోలుకోవాలని సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ ట్వీట్ చేశారు. తమన్ ఓ వీడియోను కూడా పెట్టారు. ఆ వీడియోలో బాలు, కోటి, మణిశర్మ, శివమణి, తమన్ తదితరులు ఉన్నారు. లాక్‌డౌన్‌కు ముందు మార్చిలో నా మామ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఉన్న వీడియో. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీరు ఆగడం లేదు. మామా.. దయచేసి ఆరోగ్యంగా తిరిగి రండి. బాలుగారి కోసం ప్రార్థన చేద్దాం. నాకు మీ అందరి మద్దతు కావాలి` అని తమన్ పేర్కొన్నారు.