జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకెళ్లే ఎమ్మెల్యే కావాలా? : మంత్రి కేటీఆర్‌

-

మరోసారి మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ పేరును అంతర్జాతీయస్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి పైసలను నమ్ముకున్నాడని, అందుకే లీడర్లను కొంటున్నారని ఆరోపించారు. రేవంత్ లీడర్లను కొనవచ్చు.. కానీ కొడంగల్ ప్రజలను కొనలేడన్నారు. జనంలో ఉండి అభివృద్ధి చేసే ఎమ్మెల్యే కావాలా? జైలుకు వెళ్లే ఎమ్మెల్యే కావాలా? అని చురకలు అంటించారు. ఇక్కడి నుంచి నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా ఆయనకు ప్రమోషన్ ఇప్పిస్తానన్నారు.

Apologise to nation,' Telangana minister KT Rama Rao writes to Centre over  fuel price hike - India Today

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ కరెంట్ పోయిందన్నారు. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి నిరసన తెలిపారని గుర్తు చేశారు. అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు బాధపడుతున్నారన్నారు. తెలంగాణలో మనం 24 గంటల విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ అక్కడ 5 గంటలు ఇస్తోందన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా ముందుకు సాగుతోందన్నారు. రెండేళ్లలో కొడంగల్‌లో 1.25 లక్షల ఎకరాలకు కృష్ణా నీటిని మళ్లిస్తామన్నారు. మద్దూరును మున్సిపాలిటీగా చేస్తానని చెప్పారు. కొడంగల్‌లో ఆర్డీవో కార్యాలయం, 100 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news