ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడవక ముందే కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రాములు నాయక్ తెరాసలో చేరారు. తెలంగాణ భవన్‌లో తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా వైరా సీటును సీపీఐకి కేటాయించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి వైరాలో జయకేతనం ఎగురవేశారు. ఈ గెలుపు తర్వాత ఆయన స్వతంత్రుడిగానే ఉంటారా? లేకపోతే ఏదైనా పార్టీలో చేరతారా?అనే చర్చలు జరుగుతుండగానే… ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో ప్రజా కూటమి బలం మరింత పతనం కావడంతో అక్కడక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు తెరాస వైపు చూస్తున్నారు. దీంతో రేపటి నుంచి మరెంత మంది క్యూ కడతారో చూడండి.