ఉద్యోగ నియామకాలు, యాసింగి పంటల సాగుపై విధానపరమైన నిర్ణయం చర్చించేందుకు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానున్నది. సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన భేటీ కానున్నది. కొత్త జోనల్ విధానం అమలు తర్వాత 60వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆర్థికశాఖ దస్త్రం రూపొందించింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎంత వరకు వచ్చిందనే దానిపైనా క్యాబినెట్ చర్చించి, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నది.
ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో యాసంగిలో పంటల విధానంపైన కూడా క్యాబినెట్ చర్చించనున్నది. ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయడం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సన్నద్ధతపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.