పార్లమెంట్ ముందుకు రైతు చట్టాల రద్దు బిల్లు… సభ ముందుకు మొత్తం 26 బిల్లులు

-

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాాలు ప్రారంభం అవనున్నాయి. ఇందుకు సంబంధించి నిన్ననే ప్రభుత్వం అన్ని ప్రధాన ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ లో పెట్టబోయే బిల్లులపై అన్ని పార్టీకలు తెలియజేశారు. ఈ సమావేశాల్లో మొత్తం 26 బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది బీజేపీ సర్కార్. ది ఎలక్ట్రిసిటీ బిల్ 2021 సవరణ, ద నేషనల్ ట్రాన్స్ పోర్ట్ యూనివర్సిటీ బిల్, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లుల, నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోటిక్ సబ్‌స్టాన్సెస్ (సవరణ) బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సవరణ) బిల్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్, ది కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ మరియు కంపెనీ సెక్రటరీల (సవరణ) బిల్లు మొదలైనవే కాకుండా ముఖ్యమైన ది ఫార్మ్ లాస్ రిపీల్ బిల్లు 2021ను వంటి బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారు.

పార్లమెంట్

ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన బిల్లుగా భావిస్తున్న వ్యవసాయ చట్టాల రద్దు బిల్లను ముందుగా పార్లమెంట్ లోని లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. దీని తర్వాత రాజ్య సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇదిలా ఉంటే శీతాాాాాాాాకాల సమావేశాలు వాడీవేడీగా జరుగనున్నాయి. ప్రస్తుతం ప్రవేశపెడుతున్న 26 బిల్లలును పక్కన పెడితే … రైతులు, విపక్షాల నుంచి మద్దతుధర హామీపై బిల్లను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటు విద్యుత్ చట్టాల ఉపసంహరించుకోవాలని రైతులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news