మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలు ఆందోళన చేశారు. అంగన్వాడి కార్యకర్తలు, ఆయాల చీరల కోసం 16 కోట్లు ఇచ్చామని, స్మార్ట్ ఫోన్ల కోసం 85 కోట్లు ఖర్చు చేశామని, రీఛార్జిల కోసం 12 కోట్లు అయ్యాయని స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని అంగన్వాడి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ -మచిలీపట్నం హైవేను అంగన్వాడి కార్యకర్తలు నిర్బంధించారు. అలాగే మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అంగన్వాడి కార్యకర్తలు చేశారు. ఈ క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ,పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత జరిగింది. అంగన్వాడి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాస్తారోకలు నిర్వహించారు గత పది రోజులుగా ఆందోళన చేస్తు ఉంటే ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ వారు ప్రభుత్వంపై మండిపడ్డారు.